● నానాటికి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
● హీట్‌స్ట్రోక్‌తో ప్రజల అవస్థలు
● ఆక్వాకు పొంచి ఉన్న ప్రమాదం
వడదెబ్బ తగిలితే ఈ ఐదు పనులు చేయాల్సిందే
● ఆ వ్యక్తిని ఏదైనా చల్లని ప్రాంతం, నీడలో పడుకో పెట్టాలి.
● చల్లని నీటితో చర్మాన్ని తుడిచి, బట్టలను తడపాలి.
● ఆ వ్యక్తికి గాలి తగిలేలా చూసి, చల్లని తాగునీటిని అందించాలి.
● ఐస్ పెట్టడం కానీ కోల్డ్ కంప్రెషన్ ఇవ్వాలి.
కై కలూరు: ఉమ్మడి జిల్లాలో ఇటీవల కాలంలో ఉష్ణోగత్రలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ కూలీలపై భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. చిరు వ్యాపారులు ఎండ తీవ్రత తట్టుకోలేక దుకాణాలను మూసేస్తోన్నారు. ఉమ్మడి జిల్లాలో ఆక్వా సాగు మొత్తం 2.90 లక్షల ఎకరాల్లో సాగు చేస్తుండగా, కై కలూరు నియోజకవర్గంలో 84,852 ఎకరాల్లో సాగు జరుగుతుంది. సాధారణంగా చేపలు 20 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేట్ ఉష్ణోగ్రతనే తట్టుకుంటాయి. అలాంటిది అంతకు మిచి ఉష్ణోగ్రతలు ప్రతిరోజూ నమోదు అవుతుండడంతో చేపలు, రొయ్యలు సాగుపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో అధిక ఎండల నుంచి రక్షణకు ఆక్వా రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
వడదెబ్బ అంటే ఏంటీ?
ఎండ తీవ్రతతో శరీర ఉష్ణోగ్రత కూడా పెరిగి మెదడు మీద చూపుతుంది. దీని వల్ల మెదడులోని ఉష్ణోగ్రత నియంత్రించే కేంద్రం (హైపో థాలామస్) దెబ్బతిని వడదెబ్బకు గురి అవుతారు దీనినే ‘హీట్‌స్ట్రోక్’ లేదా ‘సన్ స్ట్రోక్’ అంటారు. ఇది ప్రాణాంతకంగా మారుతోంది. లక్షణాలు విషయానికి వస్తే తీవ్రవైన జ్వరం, తలనొప్పి, మానసిక ఒత్తిడి పెరగడం, నీరసం, కళ్లు తిరగడం, వాంతులు, విరోచనాలు, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం, శరీరంపై ఎర్రని పొక్కులు రావడం, అపస్మారక స్థితి కనిపిస్తాయి.
వేసవిలో నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి ఉప్పు కలిపిన పానీయాలు ఎక్కువగా తాగాలి. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. లేత సుతిమెత్తని వదులు కాటన్ దుస్తులు ధరించాలి. ప్రతి ఇంటిలోనూ ఓఆర్‌ఎస్ ద్రావణం ఉంచుకోవాలి. తేలికపాటి ఆహారం తీసుకోవాలి. వడదెబ్బ తగిలితే వైద్యులను సంప్రదించండి.
– డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్, సీహెచ్‌సీ, కై కలూరు
కై కలూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన జంగం వెంకటేశ్వరమ్మ(50) గురువారం మధ్యాహ్నం ఎండలో ఆరుబయట అంట్లు తోముతూ అపస్మరక స్థితిలోకి వెళ్లిపోయింది. కుమార్తె కై కలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురాగానే అప్పటికే ఆమె చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. బుట్టయగూడెంలో ఓ వ్యక్తి ఉదయం
ఎండలో వస్తూ వాహనంతో గోడను ఢీకొట్టాడు. వడదెబ్బ ప్రభావంతోనే ఇది జరిగింది.. ఇలా అనేక ఘటనలు జిల్లాలో ఎండల తీవ్రతకు అద్దం పడుతున్నాయి.


