ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో జీఎస్టీ వసూళ్లకు గాను వివిధ ప్రభత్వ శాఖల ద్వారా నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు, తదితరుల వివరాలు వెంటనే వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అందించాలని జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి జిల్లా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల కాంట్రాక్టర్ల నుంచి జిఎస్‌టీ వసూళ్లపై వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమీషనర్ నాగార్జునరావు తో కలిసి జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో మంగళవారం కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిలాల్లో సంక్షేమ వసతి గృహాలకు మరమ్మతునులు, వసతిగృహాలకు వివిధ సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లు, అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్ల నుండి టీడీఎస్ వసూలు చేసి సంబంధిత వివరాలను వాణిజ్య పన్నుల శాఖాధికారులకు అందించాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, వాణిజ్యపన్నుల శాఖ జాయింట్ కమిషనర్ నాగార్జునరావు పాల్గొన్నారు.


