జనన, మరణ రికార్డుల తనిఖీ | - | Sakshi
Sakshi News home page

జనన, మరణ రికార్డుల తనిఖీ

May 5 2026 9:31 AM | Updated on May 5 2026 9:31 AM

జనన, మరణ రికార్డుల తనిఖీ

తాడేపల్లిగూడెం (టీఓసీ): రీజనల్‌ డైరెక్టర్‌ మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసస్‌ జోన్‌ 2, డిప్యూటీ డైరెక్టర్‌, వైటల్‌ స్టాటిస్టిక్స్‌ కె.శ్రీనివాసరావు (రాజమండ్రి), స్టాటిస్టికల్‌ అధికారి ఎంవీ ప్రసాద్‌ (భీమవరం) ఆ ధ్వర్యంలో సోమవారం స్థానిక ము న్సిపల్‌ కార్యాలయంలోని జనన, మరణ విభాగంలో రికార్డులను తనిఖీ చేశారు. సీఆర్‌ఎస్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్‌లను, ప్రైవేట్‌ ఆస్పత్రుల నుంచి వచ్చే జనన, మరణ నమోదులను, పాత రికార్డులను పరిశీలించారు. హెల్త్‌ అసిస్టెంట్లకు సమావేశం నిర్వహించి రిజిస్ట్రేషన్‌ ఎలా చేయాలో చెప్పారు. నమోదుల్లో జాప్యం ఉండకూడదన్నారు. అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ ఇన్‌చార్జి ఎన్‌.రజనీ, హెల్త్‌ అసిస్టెంట్లు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement