పడకేసిన వైద్యం | - | Sakshi
Sakshi News home page

పడకేసిన వైద్యం

May 4 2026 10:31 AM | Updated on May 4 2026 10:31 AM

న్యూస్‌రీల్‌

జిల్లాలో ఆస్పత్రులు

ప్రజారోగ్యానికి కూటమి సర్కారు నిర్లక్ష్య రోగం పట్టింది. అరకొర మందులు, వైద్య సిబ్బంది కొరత, వైద్యులు సకాలంలో రాక రోగుల పడిగాపులు, పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక దుర్గంధం వెదజల్లుతున్న వార్డులు, టాయిలెట్స్‌, సౌకర్యాల లేమి.. రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఓపీ వద్ద నుంచే రోగులకు అవస్థలు మొదలవుతున్నాయి. అడుగడుగునా సమస్యలతో అత్యవసర వైద్యం గగనమవుతుంది. జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో ఎన్నో సమస్యలు వెలుగుచూశాయి.

సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 2026

సాక్షి, భీమవరం: జిల్లాలో ఒక జిల్లా ఆరోగ్య కేంద్రం, నాలుగు ఏరియా ఆస్పత్రులు, మూడు సీహెచ్‌సీలకు గాను 19 మంది వైద్యుల పోస్టులు ఖాళీ ఉన్నాయి. 34 పీహెచ్‌సీలు, 18 యూపీహెచ్‌సీల్లో 68 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా 56 మంది, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ 34 మందికి 24 మంది, ఫార్మాసిస్టులు 34 మందికి 21 మంది, క్లాస్‌–4 సిబ్బంది 34 మందికి 17 మంది, ఎస్‌ఏడబ్ల్యూ సిబ్బంది 34 మందికి 15 మంది మాత్రమే ఉన్నారు.

● భీమవరం ఏరియా ఆస్పత్రిలో ముగ్గురు వైద్యులు, ఎక్స్‌రే విభాగంలో టెక్నీషియన్స్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 15 మంది పారిశుద్ధ్య కార్మికులు అవసరం కాగా తొమ్మిది మంది మాత్రమే పనిచేస్తున్నారు. ఎముకలు, కంటి వైద్యానికి సంబంధించి సరైన సదుపాయాలు లేవు. బీపీ ముందులు, కాల్షియం, దగ్గు మందులు కొరతతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ సరిగాలేక టాయిలెట్స్‌, పాత ఆస్పత్రి భవనంలో వార్డులు దు ర్వాసన వెదజలుతున్నాయి. ల్యాబ్‌లో ఎంఆర్‌ఐ, సి టీ స్కానింగ్‌, థైరాయిడ్‌ పరీక్ష సౌకర్యం లేదు. కుటుంబ నియంత్రణలకు సంబంధించి ప్రత్యేక విభాగం లేక ఆపరేషన్లు జరగడం లేదు.

● మంత్రి నిమ్మల రామానాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకొల్లులోని ఏరియా ఆస్పత్రి కోసం గత వైఎస్సార్‌ ప్రభుత్వం రూ.12.60 కోట్లతో నిర్మించిన భవనం ఇంకా ప్రారంభానికి నోచుకోక పాత భవనంలోనే ఆస్పత్రి నిర్వహిస్తున్నారు. మహిళల వార్డులో ఫ్యాన్లు తిరగక బాలింతలు, గర్భిణు లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండ వేడికి తాళలేక ఇళ్ల వద్ద నుంచి టేబుల్‌ ఫ్యాన్లు తెచ్చుకుని తమ బెడ్లు వద్ద ఏర్పాటు చేసుకుంటున్న పరిస్థితి కనిపించింది. రోగులకు అందించే ఆహారం నాణ్యత ఉండటం లేదని, ఉదయం టిఫిన్‌ 9.30 గంటల తర్వాత, మధ్యాహ్నం భోజనం 1.30 తర్వాత అందజేస్తున్నారని రోగుల బంధువులు తెలిపారు. అన్నం గడ్డలు కట్టి ఉండటంతో బయటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నామని చెప్పారు. ఆస్పత్రి పరిసరాలు సరిగా లేక ఇన్‌పేషెంట్లు ఇబ్బంది పడాల్సి వస్తోంది. అంబులెన్స్‌ ఉన్నా పర్మినెంట్‌ డ్రైవర్‌ లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఎవరినో ఒకరిని ఏర్పాటు చేసి పంపిస్తున్నారు.

● తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో వై ద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఆస్పత్రి విస్తీర్ణంతో పాటు బెడ్స్‌కు తగ్గట్టు శానిటరీ వర్కర్స్‌ లేక పారిశుద్ధ్య నిర్వహణ లోపిస్తోంది. పూర్తిస్థాయి రేడియాలజిస్ట్‌లు అందుబాటులో లేకపోవడంతో గర్భిణులు మినహా ఇతరులు ప్రైవేట్‌ ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వస్తుంది. మత్తు వైద్యుడు ఒక్కరే ఉండడంతో రాత్రి సమయాల్లోను, ఆదివారం రోజుల్లో ప్రైవేటు మత్తు వైద్యుడిని తీసుకురావాల్సి వస్తుంది. సేవలు నిమిత్తం కిందిస్థాయి సిబ్బంది రూ.100 నుంచి రూ.200 వరకు తీసుకుంటున్నట్టు రోగుల బంధువులు చెబుతున్నారు.

● పెనుగొండలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గైనకాలజిస్ట్‌ లేక గర్భిణులు వైద్యం కోసం పాలకొల్లు, తణుకు ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. దీంతో పేద మహిళలు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖ్యమైన ఆర్థోపెడిక్‌, గైనకాలజిస్ట్‌ డాక్టర్లు లేరు. జనరల్‌ డ్యూటీ అటెండర్లు కేవలం ముగ్గురే ఉండడంతో రోగులకు సదుపాయాలు అందించేవారు కరువయ్యారు. చాలీచాలని బెడ్లతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. బెడ్‌ ఖాళీ లేని సమయంలో తణుకు, పాలకొల్లులోని ప్రభుత్వ ఆస్పత్రులకు సిఫార్సు చేస్తున్నారు. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ తణుకు, పెనుగొండలకు ఒకరే సిబ్బంది కావడంతో వారు వచ్చే వరకూ వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది.

● నరసాపురంలోని ఏరియా ఆస్పత్రిలో సకాలంలో వైద్యులు విధులకు హాజరుకాక రోగులు పడిగాపులు కాయాల్సి వస్తుంది. ఓపీ రిజిస్ట్రేషన్‌ కోసం అవసరమైన కౌంటర్లు ఏర్పాటుచేయక రోగులు గంటలు తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. ఎక్స్‌రే యూనిట్‌ సరిగా పనిచేయక రోగులను ప్రైవేట్‌ ల్యాబ్‌లకు పంపిస్తున్నారు. పవర్‌కట్‌ల సమయంలో ఆస్పత్రిలోని జనరేటర్‌ను కేవలం ఆపరేషన్‌ థియేటర్‌ కోసం మాత్రమే వినియోగిస్తుండటంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

● తాడేపల్లిగూడెంలోని ఏరియా ఆస్పత్రిలో నా లుగు వైద్య పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్నెట్‌ పనిచేయక ఓపీ రిజిస్ట్రేషన్‌ ఆరుబయట ఏర్పాటుచేయడంతో రోగులు ఎండలో నిల్చోవాల్సి వస్తుంది. బలం కోసం ఇచ్చే టానిక్‌లు, కొన్ని రకాల మందులను బయట కొనుక్కోమని చెబుతున్నారని రోగులు అంటున్నారు. వార్డుల్లోని బెడ్లు సరిగా లేక రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది.

● ఆకివీడులోని సీహెచ్‌సీలో జనరల్‌ సర్జన్‌ పోస్టు ఖాళీగా ఉండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో మాదిరి వైద్యసేవలు అందడం లేదని ఆస్పత్రికి వచ్చిన వారు చెబుతున్నారు. గతంలో సదరం క్యాప్‌ ఆకివీడు సీహెచ్‌సీలో జరిగేది. ప్రస్తుతం సదరం క్యాంపులు నిర్వహించడం లేదు.

తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రి బయట ఓపీ రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌

భీమవరం ఏరియా ఆస్పత్రిలో జనరల్‌ వార్డు

జిల్లా ఆస్పత్రి తణుకు

ఏరియా ఆస్పత్రులు భీమవరం, నరసాపురం,

పాలకొల్లు, తాడేపల్లిగూడెం

సీహెచ్‌సీలు ఆకివీడు, ఆచంట,

పెనుగొండ

పీహెచ్‌సీలు 34

యూపీహెచ్‌సీలు 18

రోజువారీ ఓపీ 15,500

ప్రభుత్వాస్పత్రులకు సుస్తీ

ప్రజారోగ్యంపై కూటమి నిర్లక్ష్యం

మందుల కోత, అధ్వానంగా పారిశుద్ధ్య నిర్వహణ

భర్తీకి నోచుకోని పోస్టులు

మందులు, రక్త పరీక్షల కోసం బయటకు సిఫార్సులు

దుర్గంధం వెదజల్లుతున్న వార్డులు

ఓపీ నమోదుకు తప్పని తిప్పలు

Advertisement
 
Advertisement
Advertisement