ప్రశాంతంగా నీట్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా నీట్‌

May 4 2026 10:31 AM | Updated on May 4 2026 10:31 AM

భీమవరం: స్థానిక డీఎన్నార్‌ కళాశాలలో ఆదివారం నిర్వహించిన నీట్‌ యూజీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు ఉదయం నుంచే అభ్యర్థులు రావడం మొదలైంది. డీఎన్నార్‌లోని రెండు పరీక్షా కేంద్రాల్లో 1,154 మంది విద్యార్థులకు 1,109 మంది హాజరయ్యారు.

నిబంధనలు కఠినంగా అమలు

నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హైరానా పడ్డారు. ప్రత్యేకమైన దుస్తులు ధరించడంతో పాటు కాళ్లకు పట్టీలు, చెవులకు రింగులు, చేతికి తాళ్లు, మెడలో ఆభరణాలు వంటివి ధరించకూడదనే నిబంధనతో కేంద్రం బయట వాటిని తొలగించేందుకు తల్లిదండ్రులు సహాయం చేశారు.

తల్లిదండ్రుల పడిగాపులు : పరీక్షకు హాజరైన వారిలో ఎక్కువ మంది విద్యార్థినులే ఉన్నారు. వారు పరీక్ష రాసి వచ్చేవరకూ తల్లిదండ్రులు కేంద్రం చుట్టుపక్కలే వేచి ఉన్నారు. ఉదయం ఆకాశం మబ్బులతో ఉన్నా ఉక్కపోతతో తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు.

కేంద్రం వద్ద తనిఖీలు, చెవిదిద్దులు తీస్తూ..

Advertisement
 
Advertisement
Advertisement