కార్మికుల సంక్షేమం వైఎస్సార్‌సీపీ లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

కార్మికుల సంక్షేమం వైఎస్సార్‌సీపీ లక్ష్యం

May 2 2026 11:55 AM | Updated on May 2 2026 11:55 AM

కార్మికుల సంక్షేమం వైఎస్సార్‌సీపీ లక్ష్యం

ఏలూరు టౌన్‌: కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పేద, మద్యతరగతి వర్గాలకు మేలు చేయటమే లక్ష్యంగా వైఎస్సార్‌సీపీ పనిచేస్తోందని ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్‌) అన్నారు. ఏలూరులోని పార్టీ కార్యాలయం వద్ద శుక్రవారం వైఎస్సార్‌టీయూ నగర అధ్యక్షుడు గంటా రాజేశ్వరరావు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ని ర్వహించారు. డీఎన్నార్‌ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్‌తో కలిసి వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీఎన్నార్‌ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పథకాలు అందించారని గుర్తుచేశారు. దేశాభివృద్ధిలో కార్మికుల పాత్ర మరువలేమన్నారు. తమ పార్టీ ఎల్లప్పుడూ కార్మికుల పక్షపాతిగా ఉంటుందనీ, రాబోయే కాలంలో అధికారంలోకి వచ్చిన అనంతరం సమాజంలోని అన్నివర్గాలకు మేలు చేసేలా పథకాలు అందిస్తామని చెప్పారు. అనంతరం చల్లటి మజ్జిగ, తాగునీరు పంపిణీ చేశారు. నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, కై కలూరు నియోజకవర్గ పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్‌బాబు, చింతలపూడి నియోజకవర్గ పరిశీలకుడు దాసరి రమేష్‌, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్‌, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్‌, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, నాయకులు కిలాడి దుర్గారావు, భోగిశెట్టి పార్వతి, స్టాన్లీబాబు, షేక్‌ బాజీ, భాస్కర్ల బాచి, లూటుకుర్తి సుభాష్‌, జిజ్జువరపు విజయనిర్మల, ఇనపనూరి జగదీష్‌,మేతర సురేష్‌, ఉమామహేశ్వరరావు, లక్కాబత్తుల ఏసుపాదం, కొల్లిపాక సురేష్‌, సాసుపల్లి యుగంధర్‌ప్రసాద్‌, కంచుమర్తి తులసీ, బండ్లమూడి సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏలూరు జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్‌

Advertisement
 
Advertisement
Advertisement