బుద్ధుడి బోధనలు ఆదర్శనీయం | - | Sakshi
Sakshi News home page

బుద్ధుడి బోధనలు ఆదర్శనీయం

May 2 2026 11:55 AM | Updated on May 2 2026 11:55 AM

బుద్ధుడి బోధనలు ఆదర్శనీయం

శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు

భీమవరం: ప్రపంచ మానవాళికి చక్కటి జీవన విధానాన్ని అందించిన గౌతమబుద్ధుడు గొప్ప దార్శనీయుడని శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. శుక్రవారం భీమవరం అంబేడ్కర్‌ భవనంలోని బుద్ధుని విగ్రహం వద్ద బుద్ధిస్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో బుద్ధ పూర్ణిమ (బుద్ధ జయంతి) నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. గౌతమి బుద్ధుని బోధనలు ప్రపంచ మొత్తానికి ఆదర్శనీయమని అన్నారు. బుద్ధిస్ట్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా స్టేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కోనా జోసెఫ్‌, జిల్లా అధ్యక్షుడు ఈది రవికుమార్‌ మా ట్లాడుతూ బుద్ధుడు చూపిన అహింసా మార్గం ఆధునిక ప్రపంచంలో ఒత్తిడితో కూడిన జీవితానికి అనుసరణీయమన్నారు. వన్‌టౌన్‌ ఎస్సై కృష్ణాజీ, గౌరవాధ్యక్షుడు కేసీ రాజు, గంటా సుందరకుమార్‌, బోకూరి విజయరాజు, డీకేవీ ప్రకాష్‌, జి.గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement