ప్లేస్‌మెంట్స్‌లో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

ప్లేస్‌మెంట్స్‌లో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ప్రతిభ

May 2 2026 11:55 AM | Updated on May 2 2026 11:55 AM

ప్లేస్‌మెంట్స్‌లో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ప్రతిభ

నూజివీడు: 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి చెందిన ఇంజినీరింగ్‌ ఆఖరి సంవత్సరం విద్యార్థులు ప్రతిభ చూపి అత్యధికంగా ప్లేస్‌మెంట్లు సాధించినట్లు డైరెక్టర్‌ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో 80 శాతం మంది విద్యార్థులు ఉద్యోగాలు పొందారని, మొత్తం 661 మంది విద్యార్థుల్లో 540 మంది ప్రతిష్టాత్మక సంస్థల్లో నియామకాలు పొందినట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం విద్యార్థులకు లభించిన గరిష్ట వేతనం రూ.27 లక్షలు కాగా, సగటు వేతనం రూ.6 లక్షలుగా నమోదైంది. కెమికల్‌, సివిల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మెటలర్జికల్‌ – మెటీరియల్స్‌ ఇంజినీరింగ్‌ (ఎం.ఎం.ఈ), మెకానికల్‌ విభాగాల విద్యార్థులకు వంద శాతం ప్లేస్‌మెంట్లు లభించాయి. పలు ప్రముఖ సంస్థలు క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారా చేపట్టిన ఈ నియామకాల్లో విద్యార్థులు విశేష ప్రతిభ కనబర్చి ఉద్యోగాలు సాధించడం గర్వకారణమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను డైరెక్టర్‌తో పాటు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్‌, పరిపాలనాధికారి బి. లక్ష్మణరావు, డీన్‌ అకడమిక్స్‌ సాదు చిరంజీవి, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ రుద్రం చింతయ్య నాయుడు, ఈ.ఐ.టి.పి డీన్‌ శ్యామ్‌, వివిధ విభాగాల శాఖాధిపతులు, అధ్యాపకులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement