ఘనంగా యూత్‌ క్లబ్‌ నాటక పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఘనంగా యూత్‌ క్లబ్‌ నాటక పోటీలు

May 2 2026 11:55 AM | Updated on May 2 2026 11:55 AM

ఘనంగా యూత్‌ క్లబ్‌ నాటక పోటీలు ట్రిపుల్‌ ఐటీలో బిల్డ్‌ విత్‌ ఏఐ వర్క్‌షాప్‌ అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

పాలకొల్లు సెంట్రల్‌: యూత్‌క్లబ్‌ నాటక పరిషత్‌ 44వ వార్షికోత్సవం సందర్భంగా నాటక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. యలమంచిలి మండలం కొంతేరులో పులపర్తి వీరాస్వామి యూత్‌ క్లబ్‌ కళామందిర్‌, కొంతేరు ఆధ్వర్యంలో మూడు రోజులు పాటు నాటక పోటీలు ప్రారంభించారు. శుక్రవారం బీవీకె క్రియేషన్స్‌ కాకినాడ వారి తితిక్ష నాటిక ప్రదర్శించారు. శ్రీ కరణం సురేష్‌ మోమోరియల్‌ ధియేటర్‌ గుంటూరు వారి తరమెల్లిపోతుంది నాటిక అలరించింది.

నూజివీడు: స్థానిక ట్రిపుల్‌ ఐటీలో ఈ నెల 2న శ్రీబిల్డ్‌ విత్‌ ఏఐశ్రీ అనే అంశంపై వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్‌ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమం క్యాంపస్‌లోని స్టూడెంట్‌ యాక్టివిటీ సెంటర్‌లో ఉదయం 10.30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. గూగుల్‌ డెవలపర్‌ గ్రూప్‌ (విజయవాడ) సహకారంతో దీనిని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి చైర్మన్‌, ఆర్జీయూకేటీ చాన్సలర్‌ ఆచార్య కొత్తా మధుమూర్తి హాజరవుతారు. ఆర్జీయూకేటీ ఉపకులపతి ఆచార్య విజయ్‌ కుమార్‌, నూజివీడు డైరెక్టర్‌ ఆచార్య గోపాలరాజు ప్యాట్రన్లుగా పాల్గొంటారు. ఈ వర్క్‌షాప్‌లో ప్రముఖ ఏఐ నిపుణులు మధు వడ్లమాని, ప్రదీప్‌ వడ్లమూరి, జగదీష్‌ బాబు కొర్ల ముఖ్య వక్తలుగా పాల్గొని తమ అనుభవాలను పంచుకోనున్నారు.

గణపవరం : గణపవరం మండలం మొయ్యేరు గ్రామానికి చెందిన కానుమిల్లి వెంకట శ్రీహరి అప్పుల బాధతో కలుపు మందు తాగి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. గణపవరం ఎస్సై ఆకుల మణికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం శ్రీహరి అప్పులు పెరిగిపోవడం, బాకీదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీహరి తల్లి గంగారత్నం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement