చూసిన కనులదే భాగ్యం | - | Sakshi
Sakshi News home page

చూసిన కనులదే భాగ్యం

May 2 2026 11:55 AM | Updated on May 2 2026 11:55 AM

చూసిన కనులదే భాగ్యం

ముదినేపల్లి(కై కలూరు): చూసిన కనులదే భాగ్యం అన్న రీతిలో సాగింది చినపూరిగా పేరొందిన వడాలి శ్రీ జగన్నాథస్వామి రథోత్సవం. ఏప్రిల్‌ 29 నుంచి వడాలిలో శ్రీ సుభద్ర బలరామ సహిత శ్రీ జగన్నాథస్వామి వార్షిక కల్యాణోత్సవాలు అత్యంత వైభవోపేతంగా సాగుతున్నాయి. ప్రధాన ఘట్టమైన రథోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. ఉదయం నిత్యోపాసన, బలిహరణ అర్చకులు చేశారు. ఒడిశా రాష్ట్రం పూరి తరహాలోనే ఇక్కడ దేవాలయంలోనూ స్వామి కై ంకర్యాలు చేస్తారు. ఆలయ ఈవో శింగనపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 4 కల్యాణోత్సవాలు ముగింపు సందర్భంగా భారీ అన్నసమారాధన జరుగుతుందన్నారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్‌పర్సన్‌ వీరమల్లు రత్నకుమారి, ధర్మకర్తలు చిలకలపల్లి నాగరాజు, పరసా గంగాధరరావు, గూడవల్లి పద్మావతి, అనగాని వెంకట నర్సమ్మ, రాజులపాటి వెంకటేశ్వరమ్మ, కల్లూరి సుబ్రహ్మణ్యం, గుర్ర పు రజనీ, నక్క వెంకట నాగలక్ష్మీ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement