ఉపాధ్యాయుల పోస్టు కార్డుల ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల పోస్టు కార్డుల ఉద్యమం

Feb 8 2026 3:47 AM | Updated on Feb 8 2026 3:47 AM

ఉపాధ్

ఉపాధ్యాయుల పోస్టు కార్డుల ఉద్యమం

ఉపాధ్యాయుల పోస్టు కార్డుల ఉద్యమం

ఆకివీడు: యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో పోస్టు కార్డుల ఉద్యమం

యలమంచిలి: కార్డులు పోస్ట్‌ చేస్తున్న పోడూరు మండల ఉపాధ్యాయులు

యలమంచిలి/ఆకివీడు: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్‌ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉపాధ్యాయులు శనివారం ముఖ్యమంత్రికి సామూహికంగా పోస్టు కార్డులు రాసి శనివారం పోస్టు చేశారు. యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎంవీ రాజశేఖర్‌ మాట్లాడుతూ ఇప్పటికే 12వ పీఆర్‌సీ ఏర్పాటుకు 30 నెలల కాలయాపన జరిగిందని, పీఎఫ్‌ లోన్స్‌, డీఏలు, ఫైనల్‌ చెల్లింపులు సైతం సకాలంలో రావడం లేదని విమర్శించారు. పెండింగ్‌ ఆర్థిక బకాయిలు వెంటనే విడుదల చేయాలని, 12వ వేతన కమిషన్‌ నియమించాలని, ఈ లోపు మధ్యంతర భృతి ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. యలమంచిలి మండల శాఖ అధ్యక్షుడు కె.నాగరాజు, ప్రధాన కార్యదర్శి కె.పెద్దిరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఉద్యమం తీవ్రతరం : ఉపాధ్యాయ సమస్యలపై పోస్టు కార్డు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నట్లు ఆకివీడు మండల యూటీఎఫ్‌ అధ్యక్షుడు ఆర్‌వీఎస్‌ నా రాయణ (విక్రమ్‌) తెలిపారు. ఆకివీడులో చేపట్టిన పోస్టు కార్డుల ఉద్యమంలో పలువురు హెచ్‌ఎంలు పాల్గొన్నారు. ప్రభుత్వం డీఏలు, మెరుగైన పీఆర్‌సీ వంటివి అమలు చేయలేదన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఈనెల 17న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఉపాధ్యాయుల పోస్టు కార్డుల ఉద్యమం1
1/1

ఉపాధ్యాయుల పోస్టు కార్డుల ఉద్యమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement