మద్దిలో అభిషేక సేవ | - | Sakshi
Sakshi News home page

మద్దిలో అభిషేక సేవ

Feb 8 2026 7:13 AM | Updated on Feb 8 2026 7:13 AM

మద్ది

మద్దిలో అభిషేక సేవ

మద్దిలో అభిషేక సేవ గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్‌ వివాహిత ఆత్మహత్య

జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం స్వామి వారికి అభిషేక సేవ నిర్వహించారు. ఆలయ ముఖ మండపంలో స్వామి ఉత్సవ విగ్రహానికి అర్చకులు, వేద పండితులు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల రూపేణా రూ.1,28,350 ఆదాయం సమకూరినట్లు ఈవో ఆర్‌వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో 1450 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈవో తెలిపారు.

ఏలూరు టౌన్‌: ఏలూరు పాతబస్టాండ్‌ పరిసర ప్రాంతాల్లో శక్తి టీమ్‌ పెట్రోలింగ్‌ విధుల్లో ఉండగా... ఒక స్కూటీపై వెళుతున్న ఇద్దరు యువకులు పోలీసులను గమనించి భయంతో పారిపోయేందుకు ప్రయత్నింగా శక్తి టీం వారిని అదుపులోకి తీసుకుని తనికీ చేసింది. గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ఇద్దరు యువకులతో పాటు మరో మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి గంజాయి, రూ.2.02 లక్షల రెండు స్కూటీలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహిళా స్టేషన్‌ డీఎస్పీ యూ.రవిచంద్ర పర్యవేక్షణలో సీఐ సుబ్బారావు ఆధ్వర్యంలో శక్తి టీమ్‌ సభ్యులు అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచారు. శనివారం శక్తి టీం సభ్యులు పాతబస్టాండ్‌ పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ చేస్తుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. 300 గ్రాముల గంజాయి, రెండు స్కూటీలు స్వాధీనం చేసుకున్నారు.

భీమవరం: భీమవరం రూరల్‌ చినఅమిరం గ్రామానికి చెందిన వివాహిత ఫ్యానుకు ఉరివేసుకుని మృతి చెందింది. సీఐ జి.కాళీచరణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఉయ్యాల స్తంభం సమీపంలో ఉంట్ను తుమ్మల భాగ్యలక్ష్మి(30)కి మూడేళ్ల క్రితం సుబ్రహ్మణ్యంతో వివాహమైంది. వీరికి ఇది రెండో వివాహం. భర్త, అత్త వేధింపులు భరించలేక కొన్నినెలలు ఆమె పుట్టింట్లోనే ఉంది. శనివారం మధ్యాహ్నం చినఅమిరం నుంచి ఫోన్‌ చేసి భాగ్యలక్ష్మి చనిపోయిందని చెప్పడంతో ఆమె తల్లిదండ్రులు హుటాహుటిన వచ్చారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మద్దిలో అభిషేక సేవ 
1
1/1

మద్దిలో అభిషేక సేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement