
వాగులు పొంగి.. పొలాలు నీటమునిగి
దెందులూరు: భారీ వర్షాలకు కొవ్వలిలో మొండికోడు, బుడమేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి. రెండు వాగుల వరద ఉద్ధృతికి కొవ్వలిలో 100 ఎకరాలు వరి పంట ముంపునకు గురైంది. ఈ రెండు వాగులు వరద పెరిగినా, వర్షాలు ఆగకపోయినా కొవ్వలిలో మరింత ముంపునకు గురయ్యే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దెందులూరులో ౖసైఫెన్‌పై నీటి ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. పెరుగుతున్న నీటి ప్రవాహాన్ని అంచనా వేసి దెందులూరు తహసీల్దార్ బీ.సుమతి, ఎస్సై ఆర్ శివాజీ సైఫన్ పై రాకపోకలను నిలుపుదల చేశారు. స్టాప్ బోర్డులను ఏర్పాటు చేశారు. సైఫన్‌లో బ్రిడ్జిల వద్ద కాపలాగా గ్రామస్థాయి ఉద్యోగులను ప్రత్యేక డ్యూటీలు వేసి రెండు వైపులా పెట్టారు. చిన్న దళిత వాడ వద్ద పైనుంచి వచ్చే వర్షపు నీరు సీతంపేట కాలువ నుంచి బయటకు రాకుండా ముందుగానే అధికారులు, రైతులు సంయుక్తంగా ఇసుక బస్తాలను రక్షణ గోడగా రెండుచోట్ల ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్‌లో పొలాలకు వెళ్లే దారి గండి పడింది. పైనుంచి వర్షపు నీరు అధికంగా రావటంతో పొలాలకు వెళ్లే రైతులకు అసౌకర్యం కలిగింది. రోడ్డు పక్కన 10 ఎకరాలు వరి పొలం నీట మునిగింది.

వాగులు పొంగి.. పొలాలు నీటమునిగి