
ఏపీలో ఉన్నది ప్రజాస్వామ్యమా? రాచరికమా?
మాజీ మంత్రి కారుమూరి మండిపాటు
తణుకు అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా.. రాచరిక వ్యవస్థ నడుస్తోందా అనే సందే హాలు ప్రజల్లో సైతం వ్యక్తమవుతున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రీజనల్ కో–ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. తణుకులోని పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల్లో పట్టు కోసం కూటమి నేతలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీతో పాటు పార్టీ శ్రేణులపై దాడికి దిగి నీచపు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిప డ్డారు. ఒక గ్రామానికి చెందిన ఓటర్లు మరో గ్రా మం వెళ్లి ఓటేయాల్సిన పరిస్థితులను ఎప్పుడైనా చూశామా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఓట్ల శాతాన్ని తగ్గించేందుకు ఇటువంటి కుట్రలకు దిగుతోందని మండిపడ్డారు. పోలీసులు వారికి తొత్తులుగా మారారని, డీఐజీ స్థాయి అధికారి వెటకారంగా మాట్లాడటం హేయమన్నారు. పులివెందులలో బ్యాలెట్ పేపర్ ఓటింగ్‌తో చంద్రబాబుకు భ యం పట్టుకుందని ఎద్దేవా చేశారు.
ఈవీఎం ముఖ్యమంత్రి.. ఈవీఎం ఎమ్మెల్యేలు
రాష్ట్ర ప్రజలంతా కూటమి ప్రభుత్వాన్ని ఈవీఎం ప్ర భుత్వంగా భావిస్తున్నారని, ఈవీఎం సీఎం గాను, ఈవీఎం ఎమ్మెల్యేలు గాను అంటున్నారని కా రుమూరి అన్నారు. ఈవీఎం స్కామ్ గురించి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సైతం ముందుగానే అనుమానం వ్యక్తం చేశారన్నారు. ఈవీఎం మిషన్‌లు చూపించిన ఓటింగ్‌కు, ఈవీఎం ప్యాడ్‌ల సంఖ్యకు భారీగా తేడా వచ్చినా ఎన్నికల అధికారులు పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వానికి వంతపాడారని విమర్శించా రు. వీటన్నింటిపై పార్టీ తరఫున న్యాయస్థానానికి వెళ్లినట్టు చెప్పారు. 45 ఏళ్ల ఇండస్ట్రీగా చెప్పుకునే చంద్రబాబు తనకు ఓట్లు వచ్చినచోట అభివృద్ధి చేయాల్సింది గాను, వైఎస్సార్‌సీపీ వాళ్లకు ఏ పనులూ చేయరాదని అధికారులకు సూచించడం దుర్మార్గమన్నారు. ఎన్నికల ముందు సంపద సృష్టించి సంక్షేమం అందిస్తామని చెప్పి, ఇప్పుడు పీ4 విధా నాన్ని అమలుచేస్తున్నామంటూ చేతులెత్తేశారన్నా రు. ఆ పీ4 ప్రక్రియను మీ పచ్చ చానల్‌లోనే ఉతికి ఆరేశారంటూ గుర్తుచేశారు. తణుకులో ఆవులు, గే దెల కోతలు, బెల్టు దుకాణాలు, సెటిల్‌మెంట్‌లతో దోపిడీ జరుగుతుందని విమర్శించారు. పంచాయ తీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, జిల్లా ఆర్గనైజేషన్ సెక్రటరీ యిండుగపల్లి బలరామకృష్ణ, నియోజకవర్గ మహిళాధ్యక్షురాలు మెహర్ అన్సారీ, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ పాల్గొన్నారు.