
ఏం సమాధానం చెబుతారు
మహిళలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ పెద్దలు ఏం సమాధానం చెబుతారు. ఎన్నికల ముందు నాది హామీ అంటూ అన్ని ప్రచార సభల్లో హామీలిచ్చారు. ఇప్పుడు వంట గ్యాస్ విషయంలో కూడా మోసం చేస్తే ఎలా?
– నిట్టా లీలా నవకాంతం, జెడ్పీటీసీ దెందులూరు
సూపర్ సిక్స్ అమలు చేస్తారా?
కూటమి ప్రభుత్వానికి సూపర్ సిక్స్ హామీలు అమలు చేసే ఉద్దేశం ఉందా లేదా? అన్ని వర్గాల ప్రజలు సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తారని ఎదురుచూస్తున్నారు. సంవత్సరం పూర్తయింది. గ్యాస్ కాకుండా ఉచిత బస్సు.. ఆడబిడ్డ నిధి ఎప్పుడు అమలు చేస్తారు.
– అప్పన పద్మావతి, వైస్ ఎంపీపీ, పెదపాడు
ప్రజల్లో తీవ్ర అసంతృప్తి
ఎన్నికల ముందు అన్ని ప్రచార సభల్లో సూపర్ సిక్స్ పేరిట హామీలిచ్చారు. సంవత్సరం గడిచినా సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదు. ఉచిత గ్యాస్, ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి మహిళలకు ఎంతో ఉపయోగపడే పథకాలు. అమలు చేయనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు?
– పర్వతనేని శ్రావణి, సర్పంచ్, రామారావుగూడెం
సబ్సిడీ జమ చేస్తున్నాం
3.30 లక్షల మంది లబ్ధిదారులు గ్యాస్ సబ్సిడీ కోసం ఆన్‌లైన్ చేశారు. సబ్సిడీ జమ కార్యక్రమం జరుగుతుంది. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీ సొమ్ము త్వరలోనే జమ అవుతుంది.
– విలియమ్స్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, ఏలూరు

ఏం సమాధానం చెబుతారు

ఏం సమాధానం చెబుతారు

ఏం సమాధానం చెబుతారు