
● ప్రాణాలతో సదరంగం
కూటమి ప్రభుత్వంలో దివ్యాంగులకు అవస్థలు తప్పడం లేదు. సామాజిక పింఛన్ల ఏరివేతలో భాగంగా దివ్యాంగులు మళ్లీ సదరం సర్టిఫికెట్ తీసుకోవాలంటూ అధికారులు కొర్రీలు పెట్టి ఆస్పత్రుల చుట్టూ తిప్పుతున్నారు. దీంతో దివ్యాంగులు, మానసిక వికలాంగులు నానా ప్రయాసలు పడుతూ ఏలూరు
జీజీహెచ్‌లో సదరం క్యాంపునకు హాజరవుతున్నారు. మండుటెండల్లో దూర ప్రాంతాల నుంచి సహాయకులను తీసుకుని ఆందోళనతో వస్తున్నారు. బుధవారం ఇలానే ఓ వృద్ధుడు జీజీహెచ్‌కు వచ్చి గుండె ఆగి ప్రాణాలు విడిచాడు. అయినా అధికారుల్లో చలనం లేదు. సదరం కేంద్రాలు నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటుచేయాలని పింఛన్‌దారులు కోరుతున్నారు. గురువారం ఏలూరు జీజీహెచ్ వద్ద కనిపించిన దృశ్యాలివి. – సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు
వృద్ధుడికి తప్పని తిప్పలు

● ప్రాణాలతో సదరంగం

● ప్రాణాలతో సదరంగం

● ప్రాణాలతో సదరంగం

● ప్రాణాలతో సదరంగం

● ప్రాణాలతో సదరంగం