భావితరాలకు మార్గదర్శి జగ్జీవన్
భీమవరం (ప్రకాశంచౌక్): బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, కార్మికుల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయులు బాబూ జగ్జీవన్ రామ్ అని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టరేట్‌లో శనివారం జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. జగ్జీవన్ చిత్రపటానికి కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగ్జీవన్ భావితరాలకు మా ర్గదర్శి అని అన్నారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి మాట్లాడుతూ దేశ చరిత్రలో లేనివిధంగా దాదాపు 30 ఏళ్లపాటు కేంద్ర మంత్రి, ఉప ప్రధానిగా ఆయన సేవలందించారన్నారు. జేసీ రాహుల్‌కుమార్ రెడ్డి మాట్లాడు తూ సీ్త్ర విద్యకు ఆయన అధిక ప్రాధాన్యమిచ్చారన్నారు. డీవీఎంసీ సభ్యులు చీకటమిల్లి మంగరాజు, పొన్నమండ బాలకృష్ణ, తెన్నేటి జగ్జీవన్, బంగారు కరుణ రాజు, తాడికొండ జయకృష్ణ, విజయ రాజు, కె.క్రాంతి బాబు మాట్లాడా రు. జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారిక అధి కారి బీవీఎస్‌బీ రామాంజనేయరాజు, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
6 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
భీమవరం అర్బన్: జిల్లాలో 6 లక్షల టన్నులు ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని తుందుర్రులో రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో కలిసి ఆయన ప్రారంభించారు. జిల్లాలో 348 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని వారికి నచ్చిన మిల్లులకే విక్రయించుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించిందన్నారు.
2 లక్షల టన్నులు
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో దాళ్వా ధా న్యం సేకరణ లక్ష్యం 2 లక్షల టన్నుల అని జేసీ పి.ధాత్రిరెడ్డి తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని, గోనె సంచులను అందుబాటులో ఉంచామన్నారు. జిల్లా లోని 22 మండలాల్లో 118 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు.
ఫీల్ట్ అసిస్టెంట్లపై వేధింపులు తగవు
భీమవరం: జిల్లాలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లపై రాజకీయ వేధింపులు తగదని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాతిరెడ్డి జార్జి, జక్కంశెట్టి సత్య నారాయణ శనివారం ప్రకటనలో తెలిపారు. సాధారణంగా ఫీల్డ్ అసిస్టెంట్లను జిల్లా అధికారులు నియమిస్తారని, అయితే కూటమి నాయకులు గ్రామాల్లో ఫీల్డ్ అసిస్టెంట్లను రాజీనామా చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని పే ర్కొన్నారు. ఆ స్థానంలో కూటమి పార్టీల కార్యకర్తలను ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమించేందుకు పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను వేధింపులకు గురిచేయడం సరికాదని తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించే హక్కు అధికారులకు తప్ప రాజకీయ నాయకులకు లేదని తెలిపారు. ఎప్పటినుంచో పనిచేస్తున్న మేట్లను కూడా తొలగించి ఇటీవల జాబ్ కార్డు వచ్చిన వారిని నియమించాలని మొగల్తూరు మండలంలో ఒత్తిడి చేయడం సరికాదన్నారు. వేధింపులు మానకుంటే జిల్లావ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని హెచ్చరించారు.
కారుమబ్బుల కలవరం
పెంటపాడు: కారుమబ్బులు వరి రైతులను కలవరపెడుతున్నాయి. పంట చేతికొచ్చే దశలో అకాల వర్షాలు కురిస్తే నిండా మునిగిపోతామని ఆందోళన చెందుతున్నారు. శనివారం పెంటపాడు మండలంలోని పలు ప్రాంతాల్లో ఆకాశం మబ్బులతో నిండిపోయింది. అత్తిలి మండలం, దువ్వ ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. అలాగే నిడమర్రు, గణపవరం మండలాల్లో కొన్ని గ్రామాల్లోనూ చినుకులు పడ్డాయి. దీంతో రైతులు కోత యంత్రాల ద్వారా మాసూళ్లను వాయిదా వేశారు. నవమి, దశమి రోజుల్లో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు.
భావితరాలకు మార్గదర్శి జగ్జీవన్


