హసన్పర్తి: కేయూ జంక్షన్ నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు ఫుట్పాత్లపై ఏర్పాటు చేసిన షాపులను బల్దియా అధికారులు మంగళవారం తొలగించారు. ఇటీవల కార్పొరేషన్ ప్రత్యేక అఽఽధికారి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, కమిషనర్ వెంకన్న భీమారంతో పాటు పలు ప్రాంతాల్లో ప్రధాన రహదారులను సందర్శించిన విషయం తెలిసిందే. ఆసమయంలో ఫుట్పాత్లను ఆక్రమించుకుని వ్యాపారాలు కొనసాగిస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనేపథ్యంలో బల్దియా సిబ్బంది మంగళవారం 6గంటల నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. టీబీ ఆస్పత్రి, భీమారం, కేయూసీ జంక్షన్ ప్రాంతాల్లో చిరు వ్యాపారులు.. అధికారులతో ఆందోళనకు దిగారు. కూల్చివేతలను అడ్డుకోవడానికి యత్నించారు.
రోడ్డునపడ్డ చిరు వ్యాపారుల కుటుంబాలు
అధికారులు వ్యవహరించిన తీరుతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని చిరు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తమ షాపులను తొలగించడంపై వారు కన్నీంటి పర్యంతమయ్యారు. కాగా, కేయూసీ నుంచి ఎర్రగట్టు గుట్ట, ఎర్రగట్టు గుట్టనుంచి ముచ్చర్ల క్రాస్, ఎర్రగట్టు గుట్టనుంచి బాహుపేట క్రాస్ వరకు రోడ్డుకు ఇరువైపులా పాత్లను ఆక్రమించుకుని తాత్కాలిక నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చివేస్తామని ఽఅధికారులు చెప్పారు.
చిరువ్యాపారుల ఆందోళన..
అధికారులతో వాగ్వాదం
కలెక్టర్ ఆదేశాలు అమలు


