భూముల రీసర్వేపై అపోహలు వద్దు | - | Sakshi
Sakshi News home page

భూముల రీసర్వేపై అపోహలు వద్దు

Oct 15 2026 7:54 AM | Updated on Oct 15 2026 7:54 AM

● కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద

పర్వతగిరి: భూముల రీసర్వేలో ఎలాంటి అపోహలు వద్దని, అధికారులకు రైతులు, భూ యజమానులు సహకరించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద సూచించారు. మండలంలోని గోపనపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన భూముల రీసర్వే అవగాహన సదస్సులో కలెక్టర్‌ సత్యశారద పాల్గొని రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూముల రీసర్వే ప్రక్రియ ద్వారా భూముల సరిహద్దులు, విస్తీర్ణం, భూ రికార్డుల్లో స్పష్టత, పారదర్శకత పెరుగుతాయని చెప్పారు. రికార్డుల్లో ఏమైనా తప్పులు, అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఎల్‌నినో ప్రభావం తెలంగాణపై ఎక్కువ ఉన్నందున రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) ఎల్‌.కిశోర్‌కుమార్‌, ఏడీ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారి శ్రీనివాసరావు, వరంగల్‌ ఆర్డీఓ సుమ, పర్వతగిరి తహసీల్దార్‌ వెంకటస్వామి, ఎంపీడీఓ శంకర్‌నాయక్‌, పర్వతగిరి, చౌటపల్లి సొసైటీ చైర్మన్లు అనిల్‌రావు, కుమారస్వామి, మార్కెట్‌ డైరెక్టర్‌ గొడుగు భిక్షపతి, గోపనపల్లి, అనంతారం సర్పంచ్‌లు నాంపల్లి విజయ, శ్రీలత పాల్గొన్నారు.

జగన్నాథపల్లిలో రీసర్వేపై గ్రామసభ

రాయపర్తి: రాయపర్తి మండలంలోని జగన్నాథపల్లి గ్రామంలో భూముల రీ సర్వేపై బుధవారం గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ కిశోర్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని, ప్రతీ గుంట భూమిని పక్కాగా సర్వే చేసి న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ శ్రీనివాసులు, వరంగల్‌ ఆర్డీఓ సుమ, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, డిప్యూటీ డీఐఓఎస్‌ రాజేంద్రాచారి, ఎంపీడీఓ పాక శ్రీనివాసులు, సర్పంచ్‌ బద్దం సుగుణమ్మ, దుబ్బతండా సర్పంచ్‌ దేదావత్‌ గోపాల్‌, ఆర్‌ఐ చంద్రమోహన్‌, సంధ్యారాణి, జీపీఓలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement