దామెర: నాగ్పూర్–విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మండలంలోని ఊరుగొండలో బుధవారం చదునుచేసే పనులను రెవెన్యూ, పోలీస్ అధికారుల సహకారంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. కోర్టులో కేసులు పూర్తి అయ్యాయని చెప్పడంతో పత్తి, మిరప, అరటి, వరి పంటలు తొలగించారు. పంట నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చేసినా పరిహారం చెల్లిస్తామని అధికారులు పేర్కొన్నారు. అనంతరం పనులు యథావిధిగా కొనసాగించారు. కార్యక్రమంలో తహసీల్దార్ జ్యోతివరలక్ష్మీదేవి, సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు, ఎన్హెచ్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.


