జిల్లాలో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు రూ.3.80 కోట్ల రాయితీతో 1,530 ఎకరాలకు 589 మంది రైతులకు స్పింక్లర్ల యూనిట్లను పంపిణీ చేశాం. ఇంకా 5వేల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. సీరియల్ విధానంలో అర్హులైన రైతులకు యూనిట్లు అందజేస్తున్నాం. ఆసక్తి గల రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలి. బిందు, తుంపర్ల సేద్యంతో శ్రమ ఆదా అవుతుంది. తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలను సాగు చేయవచ్చు.
– ఆర్. శ్రీనివాసరావు,
జిల్లా ఉద్యాన శాఖ అధికారి
●


