ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలపై అవగాహన కల్పించాలి

Oct 14 2026 11:10 AM | Updated on Oct 14 2026 11:10 AM

ఖిలా వరంగల్‌/న్యూశాయంపేట: ఎల్‌నినో ప్రభా వంతో వరికి బదులు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు ఆదేశించారు. ఈమేరకు మంగళవారం కలెక్టరేట్‌లో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో కలెక్టర్‌ సత్యశారద సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల వారీగా పంటల పరిస్థతి, నీటి లభ్యతను అంచనా వేయాలని, పంటలు ఎండిపోయే పరిస్థితులున్న గ్రామాలు, నీటి కొరత ఏర్పడే ప్రాంతాలను క్షేత్రస్థాయిలో గుర్తించి నివేదికలు సమర్పించాలన్నారు. వర్షపాతం, భూగర్భ జలాలు, సాగునీటి వనరుల లభ్యతపై సమగ్ర సమాచారం సేకరించాలని పేర్కొన్నారు. రబీలో అందుబాటులో ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వ్యవసాయ, నీటి పారుదల, గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్‌ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పరిశీలిస్తూ ముందస్తు చర్యలు తీసుకోవాలని, రైతులకు అవసరమైన సూచనలు అందించి పంట నష్టాన్ని నివారించేందుకు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ వైవీ గణేశ్‌, జిల్లా వ్యవసాయాధికారి విజయభాస్కర్‌, ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాస్‌రావు, డీఆర్డీఓ నాగ పద్మజ, పశు సంవర్థకశాఖ అధికారి డాక్టర్‌ బాలాజీ, సీపీఓ చంద్రకళ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారి నిర్మల తదితరులు పాల్గొన్నారు.

అధికారుల సమీక్షలో కలెక్టర్‌

డాక్టర్‌ సత్యశారద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement