కాశిబుగ్గ: ఎన్హెచ్ఎం (నేషనల్ హెల్త్ మిషన్)లో పనిచేస్తున్న ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని స్టేట్ ఎన్హెచ్ఎం జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తంగళ్లపల్లి భరత్‌కుమార్ డిమాండ్ చేశారు. వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్లో జిల్లా ఎన్హెచ్ఎం ఉద్యోగులు మంగళవారం నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యమిషన్‌లో పనిచేస్తున్న 17వేల మంది ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ప్రజారోగ్య పరిరక్షణలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు కీలకంగా వ్యవహరిస్తూ పనిచేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా వెట్టిచాకిరీ చేయిస్తోందని మండిపడ్డారు. సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంటినెంట్ ఉద్యోగుల నుంచి డాక్టర్ వరకు రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డాక్టర్ రవీందర్, నితిన్‌రెడ్డి, డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ మోహన్‌రావు, డాక్టర్ మధు, డాక్టర్ యశస్విని, డాక్టర్ రమ్య, డైట్ మేనేజర్ అనిల్, రవీందర్, సునీ త, సంఘ అనిల్‌కుమార్, అంజి, నర్మద, జ్యోతి, గీత, వైకుంఠం, పలువురు ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
అర్బన్ హెల్త్ సెంటర్ల బంద్‌తో
ప్రజలకు ఇబ్బందులు..
నేషనల్ హెల్త్ మిషన్ స్కీంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు సమ్మెలో ఉన్నారు. దీంతో వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని 14 అర్బన్ హెల్త్ సెంటర్లను బంద్ చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వైద్య సేవల కోసం ఎంజీఎం, ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వచ్చింది.
జేఏసీ వర్కింగ్ ప్రెసిడెంట్
డాక్టర్ భరత్‌కుమార్
పోచమ్మమైదాన్ సెంటర్లో
నిరవధిక సమ్మె ప్రారంభం


