న్యూస్రీల్
బుధవారం శ్రీ 14 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
ఆప్షన్ ఉద్యోగుల్లో ఆనందం
రాష్ట్రంలో మూడో డిస్కం (టీజీ ఆర్పీడీసీఎల్) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో విద్యుత్ ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి.
సాక్షి, వరంగల్: జిల్లాలో సీజనల్ వ్యాధుల ఉధృతి కొనసాగుతోంది. వర్షాలు, దోమల వ్యాప్తి, కలుషిత నీరు, పరిసరాల అపరిశుభ్రతతో ప్రజలు జ్వరాలు, డెంగీ, టైఫాయిడ్, డయేరియా బారిన పడుతున్నారు. ముఖ్యంగా డెంగీ కేసులు సెంచరీ దాటడం ఆందోళన కలిగిస్తోంది. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు జిల్లావ్యాప్తంగా 121 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఒక్క సెప్టెంబర్లోనే 54 కేసులు వెలుగుచూడడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. మరోవైపు ప్రైవేట్ ఆస్పత్రుల్లో డెంగీ, సాధారణ జ్వరాలు, డయేరియా, టైఫాయిడ్తో చేరి న వారు వందల సంఖ్యలో ఉంటారని, దీన్ని క్యాష్ గా మలుచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.
45 శాతం కేసులు
సెప్టెంబర్లోనే నమోదు..
ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు నమోదైన డెంగీ కేసులతో పోలిస్తే సెప్టెంబర్లోనే భారీగా కేసులు నమోదయ్యాయి. జనవరి నుంచి ఆగస్టు వరకు 67 కేసులు నమోదు కాగా.. సెప్టెంబర్లో మరో 54 కేసులు నమోదయ్యాయి. అంటే మొత్తం కేసుల్లో దాదాపు 45 శాతం ఒక్క నెలలోనే వెలుగుచూశాయి. నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉండడంతో డెంగీ వ్యాప్తిపై అప్రమత్తత అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
సాధారణ జ్వరాలూ తక్కువేం కాదు..
జిల్లాలో సాధారణ జ్వరాల కేసులు సైతం భారీగానే నమోదవుతున్నాయి. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 6,016 కేసులు వచ్చాయి. సెప్టెంబర్లోనే 622 మంది వైద్యసేవలు పొందారు. మరోవైపు డయేరియా కేసులు 9 నెలల్లో 3,694 నమోదయ్యాయి. సెప్టెంబర్లో 226 కేసులు వెలుగుచూశాయి. టైఫాయిడ్ కేసులు సెప్టెంబర్ వరకు 242 నమోదుకాగా.. సెప్టెంబర్లో ఏడు కేసులు గుర్తించారు. జ్వరాలు, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల పట్ల నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అప్రమత్తతే ఆయుధం.. వైద్యులను సంప్రదించాల్సిందే
సీజనల్ వ్యాధుల నియంత్రణకు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పీహెచ్సీలు, యూపీహెచ్సీల పరిధిలో వైద్య సేవలు, నివారణ చర్యలు చేపడుతున్నాం. ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. కూలర్లు, పాత టైర్లు, నీటి తొట్టెలను తరచూ శుభ్రం చేసుకోవాలి. ప్రతి శుక్రవారం డ్రై డే పాటిస్తూ దోమల వృద్ధికి అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలి. నీటిని కాచి చల్లార్చి తాగడం, ఆహారాన్ని మూతపెట్టి ఉంచడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల ముప్పును తగ్గించుకోవచ్చు. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు లేదా కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా సమీప ప్రభుత్వ ఆస్పత్రి లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలి. డెంగీ అనుమానం ఉన్నప్పుడు వైద్యుల సలహాతో అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. పిల్లలు, వృద్ధుల విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు.
–డాక్టర్ బి.రాజారెడ్డి, డీఎంహెచ్ఓ
●
జిల్లాలో ఒక్క సెప్టెంబర్లోనే
54 కేసుల నమోదు
జ్వరాలు, డయేరియాతోనూ
ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు
అప్రమత్తంగా ఉండాలని
వైద్యాధికారుల సూచన
యూపీహెచ్సీలు, పీహెచ్సీల వారీగా నమోదైన డెంగీ కేసులు..
54 డెంగీ కేసులు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నమోదయ్యాయి. కీర్తినగర్ యూపీహెచ్సీలో 9, ఎంజీఎం యూఎఫ్డబ్ల్యూసీలో 9, గీసుకొండ పీహెచ్సీ పరిధిలో ఆరు కేసులు వెలుగుచూశాయి. దేశాయిపేట, కాశిబుగ్గ, ఫోర్ట్ వరంగల్ పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఐదేసి కేసులు నమోదయ్యాయి. అలాగే, చింతల్ యూపీహెచ్సీలో 3, రంగశాయిపేట యూపీహెచ్సీలో ఒకటి, ఎస్ఆర్ఆర్ తోట యూపీహెచ్సీలో ఒక డెంగీ కేసు నమోదైంది. పీహెచ్సీల వారీగా చెన్నారావుపేటలో ఒకటి, కేశవపూర్లో ఒకటి, నెక్కొండలో రెండు, పర్వతగిరిలో ఒకటి, సంగెంలో రెండు, పైడిపల్లిలో మూడు డెంగీ కేసులు నమోదయ్యాయి.


