కూలీలకు పనులు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

కూలీలకు పనులు కల్పించాలి

Oct 14 2026 11:10 AM | Updated on Oct 14 2026 11:10 AM

● జెడ్పీ సీఈఓ ఎన్‌.వసంత

నల్లబెల్లి: వీబీజీ రాంజీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించాలని జెడ్పీ సీఈఓ వసంత అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలో పథకం అమలు తీరుపై పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లతో మంగళవారం ఆమె సమీక్ష నిర్వహించారు. కూలీలకు పనులు కల్పించడంలో వెనుకబడిన గ్రామాల్లో చేపట్టాల్సి న చర్యలపై చర్చించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో కూలీలు వలసబాట పట్టే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో కనీసం 60 మందికి తగ్గకుండా కూలీలకు పనులు కల్పించాలని, వేతనాలను సకాలంలో నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఆధికారులను హెచ్చరించారు. అంతకుముందు నందిగామ, రేలకుంట గ్రామాల్లో గ్రామైక్య సంఘాల భవనాల పనులు, జలసిరి కార్యక్రమ అమలును పరిశీలించారు. భవన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని అధి కారులకు సూచించారు. ఎంపీడీఓ రమణారెడ్డి, ఎంపీఓ పసరగొండ రవి, ఏపీఓ వెంకట్‌నారాయణ, ఈసీ రాజు, టీఏలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement