కాళోజీ సెంటర్/కాశిబుగ్గ: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులకు ఎల్ఎన్ గ్రూపులోని అసెంబ్లీ ఆపరేటర్ పోస్టులకు ఈనెల 16న ములుగు రోడ్డులోని జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి సాత్విక మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలని, ఎంపికై నవారు హైదరాబాద్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సుమారు వంద పోస్టుల్లో అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారని, మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో ఉదయం 11 గంటలకు ఇంటర్యూకు హాజరు కావాలని ఆమె సూచించారు.


