హన్మకొండ కల్చరల్: పురావస్తుశాఖ ఆధీనంలోని వేయిస్తంభాల ఆలయ అభివృద్ధి కోసం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ద్వారా కేంద్రానికి నివేదిక అందజేస్తామని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు పేర్కొన్నారు. హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయాన్ని మంగళవారం రాత్రి కమిషనర్ కుటుంబసమేతంగా సందర్శించారు. ఈసందర్భంగా ఆలయప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ, ఈఓ అనిల్కుమార్ ఆలయమర్యాదలతో, మహిళలు కోలాటాలు, వేదమంత్రోచ్చాటనలతో ఘనంగా స్వాగతించారు. రుద్రేశ్వరీ అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించుకున్నారు. కమిషనర్ మాట్లాడుతూ.. దేవాలయంలో విద్యుత్ అలంకరణ బాగుందని ఉత్సవాల ఏర్పాట్లు అడిగి తెలుసుకున్నారు. దేవాలయ ఉద్యోగుల, ధూపదీప నైవేద్య అర్చకుల సమస్యలు గంగు ఉపేంద్రశర్మ వివరించగా.. వారి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు


