నయీంనగర్: వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులు మరింత వేగవంతం చేయాలని కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి అన్నారు. మంగళవారం వరంగల్ బస్ స్టేషన్ నిర్మాణ పనులను, వాటి పురోగతిని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్తో కలిసి కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి పరిశీలించారు. బస్స్టేషన్ నిర్మాణ, అభివృద్ధి పనులకు సంబంధించిన మ్యాపును పరిశీలించారు. పనుల పురోగతిని గురించి నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కుడా చైర్పర్సన్ మాట్లాడుతూ బస్ స్టేషన్ త్వరగా పూర్తయ్యేలా నిర్మాణ పనులు సాగాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. అదనంగా మరింత మంది వర్కర్స్ను ఏర్పాటు చేయాలన్నారు. కాలమ్స్, స్లాబ్, రీటెయినింగ్ వల్ పనులు ఏకకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. కుడా ఈఈ భీమ్ రావు, డీఈ జలాలుద్దీన్, అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.


