ప్రత్యామ్నాయ పంటలే సాగు చేయండి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటలే సాగు చేయండి

Oct 13 2026 1:17 AM | Updated on Oct 13 2026 1:17 AM

గీసుకొండ:ఎల్‌నినో ప్రభావంతో రాబోయే యాసంగి సీజన్‌లో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసి.. వరి సాగుకు దూరంగా ఉండాలని కలెక్టర్‌ సత్యశారద సూచించారు. తక్కువ నీటితో, స్వల్ప కాలంలో చేతికొచ్చే పప్పుధాన్యాలు, నూనెగింజ లు, కూరగాయల సాగుకు ప్రాధాన్యమివ్వాలన్నా రు. మండలంలోని కొనాయమాకుల రైతు వేదికలో సోమవారం ‘రెతు నేస్తం’ 110వ ఎపిసోడ్‌లో భాగంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ మాట్లాడుతూ.. నీటి లభ్యతకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవాలని, నీటిని పొదుపుగా వినియోగించాలని పేర్కొన్నారు. పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగుకు ప్రభుత్వం సబ్సిడీ అంది స్తుందని తెలిపారు. డ్రిప్‌, స్ప్రింక్లర్‌ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులను వినియోగించుకోవాలని సూచించారు. నవంబర్‌లో వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నందున ‘రైతు నేస్తం’ ద్వారా ప్రతీ వారం వాతావరణ సమాచారాన్ని అందిస్తామన్నా రు. రైతులకు అవగాహన కల్పించి, ప్రత్యామ్నాయ పంటల సాగుపై దిశానిర్దేశం చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఏఓ విజయభాస్కర్‌, జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాసరావు, ఆర్డీఓ సుమ, మండల ప్రత్యేకాధికారి రమేష్‌, వర్ధన్నపేట ఏడీఏ నర్సింగం, తహసీల్దార్‌ రియాజుద్దీ న్‌, ఎంపీడీఓ శ్రీధర్‌గౌడ్‌, ఏఎంసీ ప్రియాంక, డైరెక్టర్‌ రుద్రప్రసాద్‌, హార్టికల్చర్‌ ఆఫీసర్‌ మానస, కొనాయమాకుల సర్పంచ్‌ వజ్ర రాజు, ఏపీఎం ఈశ్వర్‌, ఏపీఓ చంద్రకాంత్‌, ఏఈఓలు భరత్‌, కావ్య, స్మిత, రాజేష్‌, అఖిల ఉన్నారు.

యాసంగిలో వరికి దూరంగా ఉండండి

రైతులకు కలెక్టర్‌ సత్యశారద సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement