ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి

Oct 13 2026 1:17 AM | Updated on Oct 13 2026 1:17 AM

న్యూశాయంపేట: ప్రజావాణిలో అర్జీలు సమర్పించిన ప్రజల సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 153 అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలను సావధానంగా విని అధికారులకు తగు సూచనలు చేశారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 47, డీఆర్డీఏ 13, జీడబ్ల్యూఎంసీ 42, మిగితా శాఖలకు సంబంధించి 51 అర్జీలు వచ్చాయని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌లు ఎల్‌.కిషోర్‌కుమార్‌, వై.వీ.గణేష్‌తోపాటు డీఆర్‌ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ వసంత, హౌసింగ్‌ పీడీ విష్ణువర్ధన్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, కలెక్టరేట్‌ సూపరింటెండెంట్‌ విశ్వప్రసాద్‌ పాల్గొన్నారు.

ప్రజావాణిలో కలెక్టర్‌ సత్యశారద

153 అర్జీల స్వీకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement