మా ప్రచురణ | - | Sakshi
Sakshi News home page

మా ప్రచురణ

Oct 13 2026 1:17 AM | Updated on Oct 13 2026 1:17 AM

మంగళవారం శ్రీ 13 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

శీతాకాలం వచ్చినా తగ్గని డిమాండ్‌.. పెరిగిన వినియోగం

ఎల్‌నినో ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోత

దసరా సెలవులు వచ్చాయి. ఈ సెలవుల్లో పిల్లలు పుస్తకాలు చదువుతున్నారా.. ఏమైనా ఆటలు ఆడుతున్నారా.. మీలోని సృజనాత్మకతతో బొమ్మలు గీస్తున్నారా.. సరదాగా అమ్మ మ్మ, నానమ్మ.. తాతయ్యతో గడుపుతున్నారా.. మీరు చేసే మంచి పనిని మాతో పంచుకోండి.. మేం ప్రచురిస్తాం. మీరు చేయాల్సిందల్లా మీరు చేసే మంచి పనిని సెల్ఫీతో ఫొటో తీసి మీ పేరు, ఊరు వివరాలను నాలుగు లైన్లలో రాసి ఫొటోతోపాటు ఈ కింది నంబర్‌కు వాట్సాప్‌ చేయండి.

హన్మకొండ: శీతాకాలం వచ్చినా ఎల్‌నినో ప్రభావంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీనికితోడు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాగు కోసం భూగర్భ జలాలు తోడేందుకు విద్యుత్‌ వినియోగం పెరిగింది. దీనికి తోడు గృహాలు, వ్యాపార వాణిజ్యసంస్థలు, పరిశ్రమల్లో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఉక్కపోత భరించలేక కూలర్లు, ఏసీల వినియోగం కొనసాగుతోంది. దీంతో గతేడాదితో పోలిస్తే ఈసారి విద్యుత్‌ వినియోగం బాగా పెరిగింది. ఈ క్రమంలో విద్యుత్‌ డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ డిమాండ్‌ నిలకడగా కాకుండా రోజూ పెరుగుతూ రికార్డులు బ్రేక్‌ చేస్తోంది. టీజీ ఎన్పీడీసీఎల్‌లో అధికశాతం వ్యవసాయానికి, గృహ అవసరాలు, వ్యాపార వాణిజ్య అవసరాలు, చిన్న చిన్న పరిశ్రమలకు విద్యుత్‌ వినియోగిస్తారు. భారీ పరిశ్రమలు పెద్దగా లేవు. అయినా విద్యుత్‌ డిమాండ్‌ విపరీతంగా పెరుగుతోంది. సెప్టెంబర్‌ 9న వేసవిని మించి రికార్డు స్థాయిలో 6,948 మెగావాట్ల గరిష్ట డిమాండ్‌ నమోదైంది. అంతకు ముందు మార్చి 27న నమోదైన 6,574 మెగావాట్ల డిమాండ్‌ అత్యధికం. దీన్ని బ్రేక్‌ చేస్తూ సెప్టెంబర్‌ 9న రికార్డు స్థాయిలో డిమాండ్‌ నమోదైంది. రాష్ట్రంలో గరిష్టంగా 19,543 మెగావాట్ల డిమాండ్‌ నమోదైంది. మార్చిలో అత్యధికంగా నమోదైన 18,548 మెగావాట్ల డిమాండ్‌ను అధిగమించి ఇప్పుడు ఆల్‌టైం రికార్డు నమోదైంది.

వ్యవసాయ మోటార్లు ఆన్‌..

ప్రస్తుత వర్షాకాలమైనా చినుకు జాడలేదు. పంటలు పూర్తిగా భూగర్భజలాలపై ఆధారపడి సాగు చేశారు. భూగర్భజలాలు తోడి వరితో పాటు మెట్ట పంటలకు తడులు ఇస్తున్నారు. ఆరుతడి పంటలకు నీరు అవసరం కావడంతో వ్యవసాయ అవసరాలకు విద్యుత్‌ వినియోగం పెరిగింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఈ వానా కాలంలో అన్ని పంటలు కలిపి 14,48,052 ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో వరి 6,91,997 ఎకరాలు, మొక్కజొన్న 1,00,976, పత్తి 7,99,799 ఎకరాల్లో సాగు చేశారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో..

ఉమ్మడి జిల్లాలో విద్యుత్‌ డిమాండ్‌ ఈ నెల 6న 2,012 మెగావాట్లు, 7న 2,022, 8న 2,017, 9న 2,025, 10న 2,106, 11న 2,072 మెగావాట్లకు చేరుకుంది. గతేడాది అక్టోబర్‌ 6న 939 మెగావా ట్లు, 7న 1,026, 8న 1,206, 8న 1,364, 9న 1,269, ఈ నెల 11న 1,333 మె గావాట్ల డిమాండ్‌ నమోదైంది. విద్యుత్‌ వినియోగం చూస్తే ఈ నెల 6న 25.135, 7న 24.222, 8న 25.785, 9న 25.267, 10న 25.769, ఈ నెల 11న 28.552 మిలి యన్‌ యూనిట్లు వాడారు. గతేడాది అక్టోబర్‌ 6న 13.551 మిలియన్‌ యూనిట్లు, 7న 15.152. 8న 17.191, 9న 18.062, 10న 18.932, 11వ తేదీన 18.323 మిలియన్‌ యూనిట్లుగా నమోదైంది.

2072

మెగావాట్లు

గతేడాది

విద్యుత్‌ డిమాండ్‌

18.932

మిలియన్‌ యూనిట్లు

28.552

మిలియన్‌ యూనిట్లు

ప్రస్తుతం

విద్యుత్‌ వినియోగం వివరాలు 2025లో(మిలియన్‌ యూనిట్లలో)

జిల్లా అక్టోబర్‌ 8 9 10 11

హనుమకొండ 4.240 4.300 4.520 4.380

వరంగల్‌ 3.151 3.402 3.582 3.483

జనగామ 3.450 3.710 3.790 3.610

మహబూబాబాద్‌ 3.610 3.710 3.840 3.720

భూపాలపల్లి 2.740 2.900 3.200 3.130

విద్యుత్‌ డిమాండ్‌ 2025లో (మెగావాట్లలో)

జిల్లా అక్టోబర్‌ 8 9 10 11

హనుమకొండ 268.7 251.19 268.7 259.4

వరంగల్‌ 247.56 230.35 247.56 272.34

జనగామ 264.96 214.53 264.96 264.96

మహబూబాబాద్‌ 323.52 301.4 323.52 340.97

భూపాలపల్లి 190.07 166.55 190.07 195.84

మీ సృజన..

విద్యుత్‌ వినియోగం వివరాలు 2026 అక్టోబర్‌(మిలియన్‌ యూనిట్లలో)

జిల్లా 8వ తేదీ 9 10 11

హనుమకొండ 5.870 5.980 6.280 6.750

వరంగల్‌ 4.375 4.287 4.469 4.482

జనగామ 4.640 4.390 4.470 4.930

మహబూబాబాద్‌ 5.020 4.440 4.320 4.760

భూపాలపల్లి 3.080 3.300 3.290 4.010

ములుగు 2.800 2.870 2.940 3.620

డిమాండ్‌ (మెగావాట్లలో)

హనుమకొండ 339.66 359.20 349.52 350.3

వరంగల్‌ 340.91 336.6 343.76 345,32

జనగామ 391.09 384.32 454.29 392.2

మహబూబాబాద్‌ 476.61 465.11 483.54 488.59

భూపాలపల్లి 257.90 265.73 262.19 259.55

ములుగు 209.74 213.50 211.63 236.55

పెరిగిన ఏసీలు, కూలర్ల వినియోగం

గిరగిరా తిరుగుతున్న మీటర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement