వరంగల్ అర్బన్/ఖిలా వరంగల్ : చిన్నారులు, తల్లిదండ్రులు, కుటుంబాలకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన, పచ్చదనంతో కూడిన ప్రజా ప్రదేశాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నర్చరింగ్ నైయిబర్ హుడ్స్–2.0’సిటీ లెవల్ వర్క్షాప్ను గురువారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కమిషనర్ టి. వెంకన్న మాట్లాడుతూ పిల్లలు స్వేచ్ఛగా ఆడుకునేలా, తల్లిదండ్రులు ప్రశాంతంగా సమయం గడిపేలా నగరంలోని ప్రజా ప్రదేశాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్కులు కేవలం వినోదానికి పరిమితం కాకుండా చిన్నారుల శారీరక, మానసిక వికాసానికి దోహదపడే విధంగా రూపుదిద్దుకోవాలని సూచించారు. ఇప్పటికే సుమారు 20 ప్రాంతాల్లో పార్కులు, పైప్లైన్న్ తదితర మౌలిక సదుపాయాల పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అడిషనల్ కమిషనర్ జోనా, ప్రోగ్రామ్ మేనేజర్ అరుణిమా సేన్, సీనియర్ ప్రోగ్రామ్ అసోసియేట్స్ శబ్నా సీమాము, సుఫియాన్ఖాజీ, సీహెచ్ఓ లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, హర్టికల్చర్ ఆఫీసర్ ప్రశాంత్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మహేందర్ పాల్గొన్నారు.
గ్రేటర్ వరంగల్ కమిషనర్ వెంకన్న


