దుగ్గొండి: మండలంలోని మందపల్లి, చాపలబండ గ్రామాల్లో వీబీజీ రాంజీ పనులను జెడ్పీ సీఈఓ వసంత బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందపల్లి చెరువులో పూడికతీత పనులు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజుకు ఎంత సమయం పనిచేస్తున్నారు, పని ఎంత చేస్తున్నారు, కూలి ఎంత వస్తుంది అని ఆరా తీశారు. చాపలబండ గ్రామంలో మండల సమాఖ్య భవన నిర్మాణ పనులను పరిశీలించి వేగవంతం చేయాలని సూచించారు. ఆమె వెంట ఎంపీడీఓ లెక్కల అరుంధతి, ఏపీఓ శ్రీనివాస్, ఈసీ రాజు, సర్పంచ్లు అల్లాటి ప్రభు, మారేడుగొండ శ్రీమాలతి, ఫీల్డ్ అసిస్టెంట్లు సుమలత, రాణి తదితరులు ఉన్నారు.


