వరంగల్ చౌరస్తా: ప్రజాసేవలో ప్రధాని మోదీ పాతికేళ్ల ప్రస్థానం దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగిన మైలురాయి అని బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు. బీజేపీ వికసిత్ సంకల్ప సభ–సేవా జ్యోతి కలశయాత్ర జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ఆధ్వర్యంలో బుధవారం వరంగల్ చౌరస్తాలో జరిగింది. ఈ సందర్భంగా ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న ప్రధాని మోదీ పాలన ప్రపంచానికే దిక్సూచిగా మారిందని తెలిపారు. 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్‌గా మార్చేందుకు ప్రధానికి సహకరించాలని కోరారు. ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజలు, బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని ప్రత్యేక స్క్రీన్లపై వీక్షించారు. అనంతరం పోచమ్మమైదాన్ జకోటియా కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఇన్చార్జ్ కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, వన్నాల శ్రీరాములు, సేవా సంకల్ప అభియాన్ జిల్లా కన్వీనర్ గోగుల రాణా ప్రతాప్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ, సేవాజ్యోతి రాష్ట్ర కో కన్వీనర్ సిద్ధం నరేశ్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎరగ్రోల్ల భరత్‌వీర్, కార్యవర్గ సభ్యులు జలగం రంజిత్ రావు, కుసుమ సతీశ్, రత్నం సతీశ్‌షా, రాష్ట్ర నాయకులు కంభంపాటి పుల్లారావు, మల్లాడి తిరుపతిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శలు బాకం హరిశంకర్, బన్న ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు
గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి


