నామినేషన్ల స్వీకరణ ప్రారంభం
సారలమ్మ వచ్చిందిలా..
పగిడిద్దరాజు వచ్చాడిలా..
● మొదటి రోజు నర్సంపేటలో 11,
వర్ధన్నపేటలో 3 దాఖలు
నర్సంపేట/వర్ధన్నపేట: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీల్లో నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. నర్సంపేట మున్సిపాలిటీలో 30 వార్డులు ఉన్నాయి. మొదటి రోజు 11 నామినేషన్లు దాఖలైనట్లు మున్సిపల్ కమిషనర్ భాస్కర్ తెలిపారు. కాంగ్రెస్ ఒకటి, బీఆర్‌ఎస్ మూడు, సీపీఐ(ఎం) 2, బీజేపీ ఒకటి, ఇండిపెండెంట్ ఒకటి, ఇతర రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన పార్టీలు 3 నామినేషన్లు దాఖలు చేశాయి. అదేవిధంగా వర్ధన్నపేటలో మూడు నామినేషన్లు దాఖలయ్యాయని మున్సిపల్ కమిషనర్ సుధీర్‌కుమార్ తెలిపారు. బీఆర్‌ఎస్ తరఫున 7 వార్డు నుంచి తిరుపతి సురేశ్, 11 వార్డు నుంచి గడ్డం సంతోష్, 9వ వార్డు నుంచి కాంగ్రెస్ తరఫున పెద్దబోయిన దేవేంద్ర నామినేషన్లు దాఖలు చేశారని ఆయన పేర్కొన్నారు.
కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
వర్ధన్నపేట, నర్సంపేట మున్సిపల్ కార్యాలయాలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ డాక్టర్ సత్యశారద, ఆర్డీఓలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని, ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నామినేషన్ పత్రాల స్వీకరణ కౌంటర్లను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. అభ్యర్థులకు అనుమానాలు ఉంటే హెల్ప్ డెస్క్ ద్వారా నివృత్తి చేయాలని సూచించారు. బీసీడబ్ల్యూఓ పుష్పలత, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి ఉన్నారు.


