వరంగల్ బస్టాండ్ పనుల్లో వేగం పెంచాలి
● సమీక్ష సమావేశంలో కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: వరంగల్‌లో నిర్మిస్తున్న బస్టాండ్ పనుల్లో వేగం పెంచి నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కుడా చైర్మ న్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ సంధ్యారాణిలతో కలి సి జిల్లాలో పలు అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టరేట్‌లో గురువారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇన్నర్ రింగ్‌రోడ్‌కు సంబంధించిన పెండింగ్ చెల్లింపులు సమీక్షించి బిల్లులు క్లియర్ చేయాలన్నారు. ఫేజ్–1లో పూర్తి చేసిన రోడ్డు పనుల పురోగతిని పరిశీలించి ఫేజ్–2లో రోడ్ల నిర్మాణానికి భూసేకరణకు చర్యలు చేప ట్టాలని సూచించారు. ఉర్సుగుట్ట, దామెర చెరువుల అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో వేగం పెంచాల న్నారు. పైడిపల్లి ప్రాంతం సుందరీకరణ, పాకాల సరస్సులో కొనసాగుతున్న పనుల సమీక్ష నిర్వహించి మరింత అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఖిలావరంగల్ పురావస్తుశాఖ మ్యూజి యంలోని మౌలిక వసతుల నిర్వహణ, సందర్శకు ల సౌకర్యాలపై చర్చించారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో 5 ఎకరాల స్థలాన్ని అభివృద్ధి కోసం కుడాకు అప్పగించాలని జోనల్ మేనేజర్‌ను ఆదేశించారు. సమావేశంలో వరంగల్ ఆర్డీఓ సుమ, కుడా సీపీఓ అజిత్‌రెడ్డి, కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్క్ జీఎం స్వామి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పనిచేయాలి
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. ఈనెల ఒకటి నుంచి 31 వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నేపథ్యంలో కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో గురువారం సమీక్ష సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ఇటుక బట్టీలు, కర్మాగారాల్లో పని చేస్తున్న వలస కార్మికుల పిల్లలు విద్యకు దూరమవుతున్నారని, ఆధార్ కార్డులు లేకపోవడంతో కొంద రు పిల్లలకు ప్రభుత్వ పథకాలు చేరడంలేదన్నారు. అటువంటి పిల్లలను గుర్తించి అవసరమైన సహాయ చర్యలు అందించాలన్నారు. బాలలను పనిలోకి తీ సుకునే యజమానులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీడబ్యూఓ రాజమణి, డీఈఓ రంగయ్యనాయుడు, డీఎంహెచ్‌ఓ సాంబశి వరావు, డీసీపీఓ ఉమ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ వసుధ, సభ్యులు పాల్గొన్నారు.


