రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
● ఏసీపీ అంబటి నర్సయ్య
వర్ధన్నపేట/రాయపర్తి: ప్రతీ ఒక్క వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాలు పాలించాలని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య అన్నారు. గురువారం వర్ధన్నపేట అంబేడ్కర్ సెంటర్, రాయపర్తి మండలకేంద్రంలో రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకుని రోడ్డు భ్రద్రతా నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెల్‌ఫోన్ మాట్లాడుతూ, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, పరిమితికి మించిన ప్రయాణికులను వాహనాల్లో ఎక్కించుకుని తీసుకెళ్లడం వంటి కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అతివేగాన్ని నివారించాలని తెలిపారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించి జాగ్రత్తగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించనివారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సైలు సాయిబాబు, రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఇంటర్
ఇంగ్లిష్ ప్రాక్టికల్స్
కాళోజీ సెంటర్: జిల్లాలో గురువారం నిర్వహించిన ఇంటర్ విద్యార్థుల ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ప్రశాంతగా జరిగినట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ తెలిపారు. జనవరి 21వ తేదీ నుంచి 67 కళాశాలల్లో నిర్వహిస్తున్న ఈ పరీక్షల్లో ప్రథమ సంవత్సరం 6,047 విద్యార్థులకు గాను 5,821 మంది హాజరయ్యారని తెలిపారు. ద్వితీయ సంవత్సరం 5,413 మంది విద్యార్థులకుగాను 5,262 మంది విద్యార్థులు హాజరు కాగా 151 మంది గైర్హాజరయ్యారని వివరించారు. అయితే గైర్హాజరైనవారిలో 70 మంది ఐఐటీ, జేఈఈ పరీక్షలకు వెళ్లగా వారికి మరుసటి రోజు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలి
నర్సంపేట రూరల్ : వైద్యసిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని డీఎంహెచ్‌ఓ సాంబశివరావు అన్నారు. చెన్నారావుపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని గురువా రం ఆయన తనిఖీ చేశారు. ఆస్పత్రిలో రికార్డులు, వైద్యసిబ్బంది, హాజరు పట్టికను పరిశీలించారు. వైద్యసిబ్బంది సమయపాలన పాటించా లని, లేదంటే చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్‌కు సంబంధించిన వైద్యసేవల గురించి పలు సూచనలు చేశారు. పీహెచ్‌సీలో ఫార్మసిస్ట్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుసుకుని ఆ పోస్టును త్వరలోనే భర్తీ చేస్తామని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో ప్రాథమిక ఆర్యోగ కేంద్రం వైద్యాధికారి సరోజన, ఎల్‌హెచ్‌పీ సహజ, సీహెచ్‌ఓ భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి


