ప్రభుత్వ ఆస్పత్రి, మెడికల్ కళాశాల తనిఖీ
నర్సంపేట రూరల్ : నర్సంపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, మెడికల్ కళాశాలను డీఎంఈ ప్రత్యేక బృందం గురువారం ఆకస్మీకంగా తనిఖీ చేసింది. నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రి, మెడికల్ కళాశాలలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గతంలో డీఎంఈ అధికారికి విన్నవించారు. ఈమేరకు ఏర్పాటు చేసిన కమిటీలోని సభ్యులు.. ఉస్మానియా మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, అదనపు డీఎంఈ రాజారావు, కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, అదనపు డీఎంఈ సంధ్య గురువారం తనిఖీ చేశారు. ఉన్నతాధికారులకు లిఖిత పూర్వకంగా నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నర్సంపేట మెడికల్ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రవీణ్, ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిషన్, హెచ్‌ఓడీలు, తదితరులు పాల్గొన్నారు.


