కొండెక్కిన కోడి!
గీసుకొండ: చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు నెలల నుంచి అనూహ్యంగా ధరలు పెరుగుతూ వచ్చాయి. వరస పండుగలు, జాతరలతో చికెన్ వినియోగం పెరగడమే కాకుండా డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. బ్రాయిలర్ స్కిన్‌లెస్ చికెన్ కిలోకు రూ.300 చొప్పున వ్యాపారులు విక్రయిస్తున్నారు. అలాగే, లైవ్ కోడి ధర కిలోకు రూ.200, స్కిన్‌తో కిలో చికెన్ రూ.270, బోన్‌లెక్ చికెన్ కిలోకు రూ.520 చొప్పున విక్రయిస్తున్నారు. ధరలు కిలోకు సుమారుగా రూ.70 మేరకు పెరగడంతో చికెన్ ప్రియులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొదట గ్రామపంచాయతీ ఎన్నికలు, అనంతరం న్యూ ఇయర్ వేడుకలు, సంక్రాంతి పండుగ, ప్రస్తుతం ఊరూరా సమ్మక్క పూజలు, పైగా మేడారం సమ్మక్క– సారలమ్మ, ఐనవోలు, కొత్తకొండ జాతరలు తోడు కావడంతో చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. సహజంగా చలికాలం కావడంతో చికెన్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. కోడి పిల్ల లను ఫాంలో 40 రోజుల వరకు పెంచాలి. సాధారణ సీజన్‌లో 40 రోజుల సమయానికి కోడి రెండు కిలోల వరకు బరువు పెరుగుతుంది. చలి కాలంలో ఎక్కువగా కోళ్లు చనిపోతాయి. రెండు కిలోల కోడి ఎదగాలంటే రూ.180 నుంచి రూ.200 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని ఫాంల నిర్వాహకులు చెబుతున్నారు. జిల్లాలో సాధారణంగా ఆదివారం 80 టన్నులు, మిగి లిన రోజుల్లో 40 టన్నుల చొప్పున చికెన్ విక్రయాలు జరుగుతాయి. బ్రా యిలర్ కోళ్లను జిల్లాలోని వ్యాపారులు సిద్దిపేట, వరంగల్, మహబూబాబాద్, జనగామ, ఖిలా వరంగల్ తదితర ప్రాంతాల్లోని కోళ్ల ఫాంల నుంచి కొనుగోలు చేస్తుంటారు. అలాగే, వెన్‌కాబ్, సుగుణ, స్నేహ, ఇండియన్ బ్రాయిలర్(ఐబీ) కంపెనీల వారు పలు ఫాంలలో కోళ్లను పెంచి వ్యాపారులకు నేరుగా విక్రయించడంతోపాటు సొంత ఔట్‌లెట్లకు తరలిస్తారు. హోటళ్లు, ఫంక్షన్లతోపాటు వినియోగదారులు సొంతంగా కొనుగోలు చేసే చికెన్, లైవ్ కోళ్లు కలుపుకుని జిల్లాలో సాధారణ దినాలతో పోలిస్తే ఆదివారాల్లో రెట్టింపు అమ్మకాలు జరుగుతాయని తెలుస్తోంది. ధరలు భారీగా పెరగడంతో వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేయడం లేదని, కిలో కొనే వారు అర కిలోతో సరిపెట్టుకుంటున్నారని వ్యాపారులు చెబుతున్నారు. దేశవాళి కోళ్ల ధరలు అధికంగానే ఉంటున్నాయి. గతంలో కిలో రూ.300 నుంచి రూ.350 వరకు అమ్మేవారు. ప్రస్తుతం రూ.400 నుంచి 450 ధర పలుకుతోంది. అలాగే, గుడ్లు పెట్టే లేయర్ రకం కిలో కోడిని రూ.200 కు వ్యాపారులు విక్రయిస్తున్నారు.
చలికాలంలో చికెన్‌ను వినియోగదారులు ఎక్కువగా కోరుకుంటారు. వారి డిమాండ్‌కు తగిన విధంగా కోళ్లు లభించడం లేదు. దీంతో ధరలు పెరుగుతున్నాయి. పైగా జాతరలు, పండుగల సందర్భంగా ధరలు పెరగటంతో చికెన్ తినే వినియోగదారులు కొంత ఇబ్బందులు పడుతున్నారు. ధర ఇంత పెరిగిందేమిటని మావద్దకు వచ్చే వారు ప్రశ్నిస్తున్నారు.
– ఉప్పరపల్లి సాయిరాం,
చికెన్ వ్యాపారి, వరంగల్
రకం 2 నెలల క్రితం ప్రస్తుతం
స్కిన్‌లెస్ 220 300
స్కిన్ 200 270
బోన్‌లెస్ 400 520
దేశవాళి 350 450
లైవ్ కోడి 130 200
రెండు నెలల్లో అనూహ్యంగా పెరిగిన ధర
స్కిన్‌లెస్ కిలో రూ.300,
విత్‌స్కిన్ రూ.270
వరుస పండుగలు, జాతరలు, డిమాండ్‌కు
తగిన సరఫరా లేకపోవడమే కారణం
కొండెక్కిన కోడి!
కొండెక్కిన కోడి!


