అధికారులు సమన్వయంతో పనిచేయాలి
● టీజీఐఆర్‌డీ జేడీ ప్రసూనరాణి
● గంగదేవిపల్లిలో సర్పంచ్‌లకు
శిక్షణ తరగతుల ఏర్పాట్ల పరిశీలన
గీసుకొండ: జిల్లాలోని సర్పంచ్‌లకు విడతల వారీగా ఐదు రోజుల పాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి టీఓటీలు, ఎంపీడీఓలు, పంచాయతీరాజ్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థ(టీజీఐఆర్‌డీ) జాయింట్ డైరెక్టర్ (జేడీ) ఎస్.ప్రసూనరాణి సూచించారు. గంగదేవిపల్లిలో ఈనెల 19 నుంచి సర్పంచ్‌లకు నిర్వహించే శిక్షణ కార్యక్రమాల ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 11 మండలాల్లో 317 మంది సర్పంచ్‌లు ఉన్నారని, తొలి బ్యాచ్ కింద గీసుకొండ, సంగెం, చెన్నారావుపేటకు చెందిన 84 మందికి ఐదు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. మిగతా వారికి మూడు బ్యాచ్‌ల వారీగా శిక్షణ ఇస్తామని, ఫిబ్రవరి 20 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు. సర్పంచ్‌లు తమ గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఈ శిక్షణ తరగతులు ఎంతో ఉపయోపడుతాయని అన్నారు. సర్పంచ్‌లు అందరూ శిక్షణకు విధిగా హాజరు కావాలని కోరారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీపీఓ కటకం కల్పన, ఎంపీడీఓ కృష్ణవేణి, టీఓటీలు మాలోతు శంకర్, లెక్కల అరుంధతి, పాక శ్రీనివాస్, కూచన ప్రకాశ్, చంద్రకాంత్, జిల్లా ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి, సర్పంచ్ కూసం స్వరూప, రమేష్, క్లస్టర్ ఆపరేటర్ వేల్పుల సురేష్, తదితరులు పాల్గొన్నారు.


