వర్ధన్నపేటలో త్వరలో మున్సిఫ్ కోర్టు
● పాత మున్సిపల్ భవనాన్ని పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
నిర్మలాగీతాంబ, ఎమ్మెల్యే నాగరాజు
వర్ధన్నపేట: ప్రజలకు సత్వర న్యాయ సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు అన్నారు. వర్ధన్నపేటలోని పాత మున్సిపల్ కార్యాలయంలో మున్సిఫ్ కోర్టు తాత్కాలిక ఏర్పాటు కోసం జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్‌రావుతో కలిసి ఎమ్మెల్యే శనివారం సందర్శించారు. భవనంలో మార్పులు చేర్పులు, తదితర అంశాలపై వారికి మున్సిపల్ కమిషనర్ సుధీర్‌కుమార్ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి నిర్మలాగీతాంబ మాట్లాడుతూ వర్ధన్నపేటలో పాత మున్సిపల్ పాత భవనాన్ని కోర్టుకు అనుకూలంగా మార్పులు చేయడంతో పాటు హైకోర్టు ఆదేశాల మేరకు త్వరలో మున్సిఫ్ కోర్టు ఏర్పాటు, ఈ కోర్టు పరిధిలో పోలీస్ స్టేషన్లు, తదితర అంశాలపై చర్చింనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఎండీ.అయూబ్, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


