అలరించిన పశువుల అందాల పోటీలు
రేపు టీటీడీ ఆధ్వర్యంలో గోపూజలు
అందాల పోటీలకు వచ్చిన కోడి పుంజులు, ఆవుదూడ, గొర్రె పొట్టేళ్లు
నర్సంపేట: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నర్సంపేట బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శాంతిసేన రైతు సంఘం బాధ్యులు బుధవారం నిర్వహించిన పశువుల అందాల పోటీలు విశేషంగా అలరించాయి. రైతులు గేదెలు, ఆవులు, మేకలు, గొర్రెలు, కోళ్లు, కుక్క పిల్లలను అందంగా తయారు చేసి తీసుకొచ్చారు. ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరై మాట్లాడుతూ పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ఏసీపీ పుప్పాల రవీందర్‌రెడ్డి, పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, జగన్‌మోహన్‌రెడ్డి, రైతు సంఘం శాంతిసేన సలహాదారు ఎర్ర యాకూబ్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్లు ములుకల వినోదసాంబయ్య, విజయ్‌కుమార్, బత్తిని రాజేందర్, రైతు సంఘం అధ్యక్షుడు చిలువేరు కుమారస్వామి, గౌరవ అధ్యక్షుడు ఎర్ర జగన్‌మోహన్‌రెడ్డి, కన్వీ నర్ చిలువేరు వెంకటేశ్వర్లు, కొమ్మాలు, బుర్ర మోహన్‌రెడ్డి, రేమిడి శ్రీనివాస్‌రెడ్డి, తౌటి వెంకట్‌నారాయణ, చింతల సాంబరెడ్డి, మండల సారంగం,బోయిని రాజేందర్, చిలువేరు కొమురయ్య, సాంబరెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు.
విజేతలు వీరే..
జోడి ఎడ్లు విభాగంలో ప్రథమ బహుమతి ఎలకంటి కుమారస్వామి, ద్వితీయ గుల్లపల్లి చిన్న, తృతీయ మల్లాడి రవీందర్‌రెడ్డి అందుకున్నారు. ఆవు పోటీల్లో ప్రథమ పొగుళ్ల భూపాల్‌రెడ్డి, ద్వితీయ గుల్లపల్లి చిన్న, తృతీయ జన్ను సాంబయ్య, దూడ ప్రథమ నాడెం చిన్నవీరన్న, ద్వితీయ చింతల నరేందర్, తృతీయ కీసరి మణి, గేదె ప్రథమ కొప్పె వెంకటరత్నం, ద్వితీయ తక్కళ్లపల్లి రవీందర్, తృతీయ చీర చేరాలు, గొర్రెపోతు ప్రథమ జంపంగి రాజేశ్వర్, ద్వితీయ జంపంగి కుమార్, ఎగ్గె స్వామి, కుక్క ప్రథమ లావణ్యరెడ్డి, ద్వితీయ రాజు, తృతీయ కడారి ప్రణయ్, కోడిపుంజు ప్రథమ కృష్ణంరాజు, ద్వితీయ నాడెం సంతోష్, తృతీయ అంబాల శ్రీకాంత్, దున్నపోతు పోటీల్లో సాధుల ముత్తిలింగం బహమతులు అందుకున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన
కోడి పుంజులు, ఆవుదూడలు,
గొర్రె పొట్టేళ్లు, కుక్కలు
హాజరైన మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
హన్మకొండ కల్చరల్: సంక్రాంతి, కనుమ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం గోపూజలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ కార్యక్రమ జిల్లా బాధ్యులు రామిరెడ్డి కృష్ణమూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా హనుమకొండ బాలసముద్రంలోని శ్రీలక్ష్మీగణపతి దేవాలయం, వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లిలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గోపూజలు, ధార్మిక ప్రసంగాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
అలరించిన పశువుల అందాల పోటీలు
అలరించిన పశువుల అందాల పోటీలు
అలరించిన పశువుల అందాల పోటీలు


