భోగి సంబురం..
భోగ భాగ్యాలనిచ్చే భోగి పండుగను బుధవారం జిల్లాలో వైభవంగా జరుపుకున్నారు. వరంగల్ నగరం, నర్సంపేట, వర్ధన్నపేట, మండల కేంద్రాలతోపాటు గ్రామాల్లో వేడుకలు అంబరాన్నంటాయి. ప్రజలు ఉదయమే భోగి మంటలు వేశారు. మహిళలు లోగిళ్లలో
రంగురంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలు, పసుపుకుంకుమతో అలంకరించారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఐదేళ్లలోపు పిల్లల తలలపైన రేగు పండ్లు, నాణేలు, చెరుకు ముక్కలు, పూలు పోసి పెద్దలు ఆశీర్వదించారు. – సాక్షి, నెట్‌వర్క్
భోగి సంబురం..
భోగి సంబురం..


