తుది ఓటరు జాబితా విడుదల
నర్సంపేట: త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగను న్న నేపథ్యంలో సోమవారం అధికారులు తుది ఓట రు జాబితాను ప్రదర్శించారు. జిల్లాలోని నర్సంపే ట, వర్ధన్నపేట మున్సిపల్ కార్యాలయాల్లోని నో టీసు బోర్డులపై ఓటరు జాబితాను ఏర్పాటు చేశా రు. నర్సంపేటలోని 30 వార్డుల్లో గతంలో 41,101 ఉండగా తాజాగా విడుదల చేసిన తుది జాబితాలో 40,960 ఓటర్లు ఉన్నాయి. మహిళా ఓటర్లు 21,323, పురుష ఓటర్లు 19,642, ఇతరులు 3 ఓటర్లు ఉన్నారు.
వర్ధన్నపేటలో..
వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీ 12 వార్డులకు గాను వార్డుల వారీగా ఎన్నికల తుది జాబితా అధికారులు విడుదల చేశారు. మొత్తం 10,526 మంది ఓటర్లు ఉండగా ఇందులో పురుషులు 5,109, మహిళలు 5,416, ఇతరులు 1 ఉన్నారు. ఆర్డీఓ, తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డులో జాబితాను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుధీర్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
నర్సంపేటలో 40,960, వర్ధన్నపేట మున్సిపాలిటీలో 10,526 ఓటర్లు


