వివేకానందస్వామి స్ఫూర్తితో గ్రామాభివృద్ధి
స్వామి వివేకానంద స్ఫూర్తితో గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని ఇటీవల సర్పంచ్‌లుగా గెలిచిన యువ సర్పంచ్‌లు చెబుతున్నారు. గ్రామంలోని యువత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతామని, యువశక్తి సహకారంతో గ్రామాన్ని ప్రగతిపథాన నిలుపుతామని ఆకాంక్షిస్తున్నారు. నేడు (సోమవారం) స్వామి వివేకానంద జయంతి (యువజన దినోత్సవం) సందర్భంగా సాక్షి ప్రత్యేక కథనం –సాక్షి, నెట్‌వర్క్
కార్మికులందరికీ ఉచిత బీమా
గీసుకొండ: నేను రెండు సార్లు సర్పంచ్‌గా గ్రామానికి సేవలందించా. ప్రస్తుతం తన భార్య మానసను సర్పంచ్‌గా గెలిపించిన గ్రామస్తుల రుణం తీర్చుకోలేనిది. గ్రామంలోని దళిత కుటుంబాలకు లేబర్ కార్డు కోసం సొంత ఖర్చులతో బీమా చేయిస్తున్నా. అలాగే దళిత కుటుంబాల్లో వివాహం చేసుకున్న నూతన దంపతులకు దుస్తులు పంపిణీ చేస్తా. ఇవే కాకుండా మరెన్నో సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేవిధంగా కృషి చేస్తా.
–బోడకుంట్ల ప్రకాశ్, మచ్చాపూర్
వివేకానందస్వామి స్ఫూర్తితో గ్రామాభివృద్ధి


