కేడీసీ కామర్స్‌, ఐపీపీబీ ఎంఓయూ | - | Sakshi
Sakshi News home page

కేడీసీ కామర్స్‌, ఐపీపీబీ ఎంఓయూ

Nov 5 2025 8:19 AM | Updated on Nov 5 2025 8:19 AM

కేడీసీ కామర్స్‌, ఐపీపీబీ ఎంఓయూ

కేడీసీ కామర్స్‌, ఐపీపీబీ ఎంఓయూ

విద్యారణ్యపురి: హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం, ఇండియన్‌ పోస్టు పేమెంట్స్‌ బ్యాంకు (ఐపీపీబీ) మంగళవారం ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఈ ఎంఓయూతో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పిస్తారు. ఉద్యోగ అవకాశాలు, వృత్తినైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు దోహదం చేస్తుంది. కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ గుర్రం శ్రీని వాస్‌, కామర్స్‌ విభాగం అధిపతి డి. రాజశేఖర్‌, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ ఎ.అనిల్‌కుమార్‌, ఐపీపీబీ సీని యర్‌ మేనేజర్‌ ప్రమోద్‌, మేనేజర్‌ ప్రవీణ్‌, అ ధ్యాపకులు జె.చిన్నా, యాకూబ్‌, శివనాగశ్రీను, ఉమాదేవి, బి.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement