పెన్సిల్ మొనపై కార్తీకదీపం
నర్సంపేట: నర్సంపేట పట్టణానికి చెందిన జాతీయ అవార్డు గ్రహీత, మైక్రో ఆర్టిస్ట్ శ్రీరామోజు జయకుమార్ ‘ఆరనీకు మా ఈ దీపం కార్తీకదీపం’ అంటూ కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని పెన్సిల్(లెడ్) మొనను దీపపు ప్రమిదలా చెక్కి అందులో నూనెతో కూడిన వత్తిని వేసి వెలిగించాడు. ఈ సందర్భంగా జయకుమార్ మాట్లాడుతూ చీకట్లను చీల్చుకుంటూ అందరి జీవితాల్లో వెలుగును నింపేదే కార్తీక దీపమన్నారు.
డీటీఎఫ్ జిల్లా సదస్సును జయప్రదం చేయాలి
నర్సంపేట: నర్సంపేటలోని బాలాజీ మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో డీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నేడు (బుధవారం) ప్రభుత్వ విద్యారంగ భవిష్యత్ మన కర్తవ్యం అనే అంశంపై జరగనున్న విద్యా సదస్సును జయప్రదం చేయాలని డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.గోవిందరావు తెలిపారు. మంగళవారం పట్టణంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 60లక్షల మంది విద్యార్థుల్లో కేవలం 16 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని, సుమారు 4 లక్షల మంది ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో మిగిలిన 40 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారన్నారు. ఈ పరిస్థితి గల కారణాలను విశ్లేషించడానికి సదస్సును ఏర్పాటు చేశామన్నారు. ఈ సదస్సుకు జిల్లాలోని ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
అక్రమ డిప్యుటేషన్లు
రద్దు చేయాలి
కాళోజీ సెంటర్: ఉపాధ్యాయుల అక్రమ డిప్యుటేషన్లు రద్దు చేసి వారి మాతృ పాఠశాలకు పంపాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్‌పీసీ) జిల్లా నాయకులు తాటికాయల కుమార్, ఉటుకూరి అశోక్, ఆకుల గోవిందరావు, సుజన్ ప్రసాద్‌రావు, ఈదుల వీరస్వామి, యాకయ్యలు మంగళవారం ఒక సంయుక్త ప్రకటనలో డిమాండ్ చేశారు. అవసరం ఉన్న పాఠశాలలకు కాకుండా నిబంధనలకు విరుద్ధంగా సర్దుబాటు పేరుతో అక్రమంగా నగరంలోని పాఠశాలలకు చేసిన సర్దుబాటులను పరిశీలించి వెంటనే మాతృ పాఠశాలలకు పంపాలని, లేదంటే ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు.
కార్తీక పౌర్ణమికి ఏర్పాట్లు
హన్మకొండ కల్చరల్: కార్తీక పౌర్ణమి వేడుకలకు వేయిస్తంభాల దేవాలయంలో ఏర్పాటు చేసినట్లు వరంగల్ జిల్లా ఐదో జోన్ డిప్యూటీ కమిషనర్ సంధ్యారాణి పేర్కొన్నారు. ఆలయాన్ని మంగళవారం ఆమె సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆమెను ఆలయ మర్యాదలతో స్వాగతించారు. పూజల అనంతరం ఆమె దేవాలయాన్ని పరిశీలించి మాట్లాడారు. బుధవారం జరిగే కార్తీక పౌర్ణమి వేడుకలకు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఆమె వెంట ఆలయ ఈఓ అనిల్‌కుమార్, ఆలయ అర్చకులు, సిబ్బంది ఉన్నారు.
పెన్సిల్ మొనపై కార్తీకదీపం
పెన్సిల్ మొనపై కార్తీకదీపం


