పెండింగ్ స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలి
నర్సంపేట: విద్యార్థులకు స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని అంబేడ్కర్ సెంటర్‌లో నిరసన తెలిపి విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పాత బకాయిలను 12 విడతలుగా ఇస్తామని ప్రకటించి నేటికీ చెల్లించలేదన్నారు. నిధుల కొరత కారణంగా ప్రైవేట్ కాలేజీలు, సిబ్బంది జీతాలు సరిగా చెల్లించలేకపోతున్నామన్నారు. ఇప్పటికై నా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, రీయింబర్స్‌మెంట్ నిధులను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిద్దార్థ కళాశాల చైర్మన్ గోగుల ప్రభాకర్‌రెడ్డి, ఆచార్య కళాశాల జీజుల సాగర్, బాలాజీ ప్రిన్సిపాల్ బోనగాని రవీందర్, మాతృశ్రీ కళాశాల యాజమాన్యం తిరుపతి, యాకుబ్, తదితరులు పాల్గొన్నారు.


