అందరి సహకారంతో జాతర విజయవంతం
గీసుకొండ: అందరి సహకారంతో కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర విజయవంతమైందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ఆలయానికి అధిక ఆదాయం సమకూరడంలో అధికారులు, సిబ్బంది, అర్చకులు, ఉత్సవ కమిటీ సభ్యుల కృషి అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఆలయంలో శనివారం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు, అర్చకులు, మామునూరు ఏసీపీ తిరుపతి,గీసుకొండ సీఐ మహేందర్, ఎస్సై ప్రశాంత్, ఉత్సవ కమిటీ చైర్మన్ కడారి రాజు, సభ్యులను ఆయన సన్మానించారు. తొలుత ఈఓతోపాటు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చక్రవర్తుల శ్రీని వాసాచార్యులు, అర్చకులు రామాచార్యులు, విష్ణు ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. అర్చక ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ గంగు ఉపేందర్‌శర్మ, అన్నదాత వీరాటి రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, కాంగ్రెస్ పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడా కొమురారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్, నాయకులు కొండేటి కొమురారెడ్డి, దూల వెంకటేశ్వర్లు, కూసం రమేశ్, నాగారపు స్వామి తదితరులు పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
కొమ్మాల ఆలయంలో
అన్నదాన కార్యక్రమం ప్రారంభం


