వరద నష్టంపై కేంద్రానికి నివేదిక అందజేస్తాం | - | Sakshi
Sakshi News home page

వరద నష్టంపై కేంద్రానికి నివేదిక అందజేస్తాం

Jan 17 2026 11:49 AM | Updated on Jan 17 2026 11:49 AM

వరద నష్టంపై కేంద్రానికి నివేదిక అందజేస్తాం

వరద నష్టంపై కేంద్రానికి నివేదిక అందజేస్తాం

హన్మకొండ: హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లో మొంథా తుపానుతో పంటలు, ఆస్తి, చెరువులు, కాల్వలకు వాటిల్లిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించామని, వాటి వివరాలతో కూడిన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ గయా ప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం 8 మందితో కూడిన రెండు కేంద్ర బృందాలు హనుమకొండ, వరంగల్‌ జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాయి. అనంతరం హనుమకొండ కలెక్టరేట్‌లో కలెక్టర్లు, అధికారులతో కేంద్ర అధికారుల బృందం సమీక్ష సమావేశం నిర్వహించింది. హనుమకొండ కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ మాట్లాడుతూ హనుమకొండ మండల పరిధిలో 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నష్టంపై సర్వే పూర్తి చేశామని, 41 కాలనీల్లో బాధితులను గుర్తించామని, ప్రతి బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.15వేల చొప్పున రూ.5,23,095 బాధిత కుటుంబాలకు అందించామన్నారు. వరంగల్‌ కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద మాట్లాడుతూ పర్వతగిరి, వర్ధన్నపేట మండలాల్లో 378.318 మిల్లి మీటర్ల వర్షం కురిసిందని, ఖిలా వరంగల్‌, వరంగల్‌ మండలా ల్లో 368.271 మిల్లీమీటర్ల వర్షం కురిసిందన్నారు.

అమ్మవారి సేవలో..

హన్మకొండ కల్చరల్‌: శ్రీభద్రకాళి దేవాలయాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ జాయింట్‌ సెక్రటరీ గయా ప్రసాద్‌, కేంద్ర బృందం సభ్యులు డాక్టర్‌ పొన్నుస్వామి, భైరి శ్రీనివాసు, ఎస్‌ఎస్‌ పింటో, వనీత, నిశాంత్‌ మిశ్రా, రాహుల్‌, శశివర్ధన్‌ తదితరులు సందర్శించి పూజలు చేశారు. ఆలయ ఈఓ రామల సునీత, ధర్మకర్తల తొనుపునూరి వీరన్న, అర్చకులు వారిని పూర్ణకుంభంతో స్వాగతించారు. అనంతరం భూపాలపల్లి ఏసీపీ సంపత్‌రావు కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ గయాప్రసాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement